ashok reddy
-
జలమండలిలో కొత్తనీరు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత జలమండలి యంత్రాంగంలో కొత్త నీరు వచ్చి చేరింది. ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన కీలక ఉన్నతాధికారుల పదవీ విరమణ, బదిలీలతో కొత్తవారికి అవకాశం లభించింది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ల వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు క్రితం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరో ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే కీలక విభాగాల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చేయగా, మరో డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సుంకిశాల ఘటనలో మరో ప్రాజెక్టు డైరెకర్లపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సీజీఏ, జీఎం, డీజీఎం స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలగడంతో యంత్రాంగంలో కొత్తదనం వచ్చింది. అంతా అస్తవ్యస్తమే.. మహా నగరంలో తాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయి పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరాలో అడుగడుగునా లీకేజీలు, లోప్రెషర్, కలుíÙత నీటి సరఫరా, లైన్మెన్ల చేతివాటం, నల్లా అక్రమ కనెక్షన్లు, ఎక్కడపడితే అక్కడ పొంగిపొర్లే మురుగు, పగిలిన మ్యాన్‌హోళ్ల వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఫిర్యాదు చేస్తే కానీ స్పందించని పరిస్థితి నెలకొంది. అడుగడుగు చేతివాటంతో బోర్డుకు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తాగునీటి సరఫరా, సీవరేజ్ చార్జీల బకాయిలు కూడా పెద్దఎత్తున పేరుకుపోయాయి. అంతా ఇష్టానుసారమే.. జలమండలిలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పనితీరు ఇష్టానుసారంగా మారింది. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్లలో సైతం కనీస సమయపాలన లేకుండా పోయింది.అంతా ఫీల్డ్ విజిట్ అంటూ మధ్యాహ్నం వరకు ఆఫీస్‌లలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సాధారణ బదిలీలు జరగడంతో సర్కిల్. డివిజన్, సబ్డివిజన్లలో సైతం కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఇప్పటికైనా బోర్డు పాలన యంత్రాంగంతోపాటు సిబ్బంది పనీతీరులో మార్పు వచ్చేనా అనే చర్చ సాగుతోంది. -
‘గ్రేటర్ వరంగల్’ ముట్టడి భగ్నం
వరంగల్: బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా.. సోమవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఉదయం 10 గంటలకు నాయకులు పెద్దఎత్తున ఎంజీఎం జంక్షన్‌కు చేరుకున్నారు. ముందుగానే మోహరించిన పోలీసు బలగాలు ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కార్పొరేషన్ వైపు వెళ్లనివ్వకపోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈసందర్భంగా రాజేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హనుమకొండ, వరంగల్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేయూసీ నుంచి కాజీపేట వరకు చేపట్టిన రహదారి మరమ్మతులు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అసమర్థత కారణంగానే ఇటీవల వర్షాలకు హనుమకొండ ముంపునకు గురైందన్నారు. నాలాలు, చెరువులు, ఎఫ్టీఎల్లు కబ్జాలకు గురువుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులను అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని రాజేందర్‌రెడ్డి మండి పడ్డారు. నాయకుల అరెస్టు తరలింపు.. ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఎంజీఎం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకోవడతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడే బైఠాయించి సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీడియాతో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతుండగానే ఆయనతో పాటు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ శివారులోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, నాయకులు అశోక్‌రెడ్డి, రవీందర్, పులి రాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, కూర వెంకట్, సతీశ్, సమద్, రాజు, ఐలయ్య, సదానందం, సంపత్ యాదవ్, రాహుల్‌రెడ్డి, కార్తీక్, ముస్తాక్ నేహళ్, దీపక్‌రెడ్డి, సుధీర్, సారంగం, మహేందర్, డివిజన్ అధ్యక్షుడు, యువజన, ఎన్ఎస్యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్
మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంధ్య అనే యువతి కూడా మిస్సింగ్ అవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న అబ్బాయి కార్తీక్ ఆమె మిస్సింగ్ కేసుతో పాటు పాటు స్కూల్ స్టూడెంట్ మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. కానీ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో డౌట్స్, హర్డిల్స్ ఎదురవుతాయి. ఎన్ని కోణాల్లో చూసినా క్లూస్ దొరకవు. ఇంత క్లిష్టమైన కేసును హీరో ఎలా సాల్వ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. తక్కువ బడ్జెట్ లో కూడా టెక్నిక్ ఉంటే మేకింగ్ లో మంచి క్వాలిటీ తీసుకురావచ్చని ఈ చిత్ర ట్రైలర్ చూపించింది. -
అశోక్‌రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్‌కు బానిసై క్రికెట్ మొదలు హార్స్‌రైడింగ్‌వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్‌కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్‌రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. నాగోల్‌లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్‌పల్లిలోని భక్తినగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్‌లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
‘నాన్నంటే' .. పిల్లలకు మంచి సందేశం ఇచ్చే చిత్రం
వై ఎస్ కె, నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు. కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... నాన్న గొప్పదనాన్ని ఈ చిత్రం మరింత గొప్పగా చెప్పిందని, పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తుందని అన్నారు. శివ సాంగ్ చాలా బాగుందన్నారు.ర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ... నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. కోట శంకర్ రావు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ తనకు మంచి పాత్ర ఇచ్చారని, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. -
శ్రావణి కేసు: వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి అశోక్‌రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ రెడ్డి శ్రావణిని విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఆ విచారణలో.. ‘‘ 2017 నుంచి శ్రావణితో అతడికి పరిచయం ఉంది. అశోక్‌రెడ్డి తీసిన ఆర్ఎక్స్ 100లో ఆమెకు గెస్ట్ రోల్ ఇచ్చాడు. శ్రావణిని అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేశాడు.శ్రావణికి పలుమార్లు ఆర్థికసాయం చేసిన అశోక్‌రెడ్డి ఆర్థిక సాయం నెపంతో ఆమెపై జులుం చేశాడు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు దిగాడు. శ్రావణి చనిపోయిన రోజున కూడా ఆమె ఇంటికొచ్చి, కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ( శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ) అదే సమయంలో శ్రావణి ఇంటికొచ్చిన సాయి, అశోక్‌రెడ్డితో కలిసి ఆమెను టార్చర్ చేశాడు. ఇద్దరి వేధింపులను శ్రావణి దేవరాజ్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి శ్రావణిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ముగ్గురి వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంద’’ని వెల్లడైంది. -
అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు..
-
శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు..
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో ఫోన్లో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న ఆయన బుధవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు. (శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!) అనంతరం అశోక్ రెడ్డిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత అశోక్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జి ముందు ప్రవేశపెట్టి...న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయం విదితమే. (శ్రావణి కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి లొంగుబాటు) అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు.. శ్రావణి ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది..?? ఆమెతో ఉన్న పరిచయం ఏంటి..?? సాయి కృష్ణ రెడ్డి తో కలిసి శ్రావణిని ఏం బెదిరించారు..?? శ్రావణి ని వివాహం చేసుకుంటానని ఆ తరువాత సాయి కృష్ణారెడ్డితో కలిసి ఎందుకు వేధించారు..?? అనేక ప్రశ్నలకు సమాధానం రాబడుతున్న ఎస్సార్ నగర్ పోలీసులు -
శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కోవిడ్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో కొనసాగిన విచారణలో నిందితులు కీలక అంశాలను రాబట్టారు. దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేవరాజ్, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్) -
ఆలోచింపజేసే పాయింట్‌తో
‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నేను నమ్మను. మంచి సినిమానా? కాదా? అనేది నమ్ముతాను. ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. శైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో క్రౌడ్ ఫండెడ్ సినిమాగా తెరకెక్కిన ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్‌ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సుధీర్ వర్మ రైటింగ్, మనోహర్ కెమెరావర్క్, కార్తీక్ ఎడిటింగ్, యశ్వంత్ నాగ్ మ్యూజిక్ మా సినిమాకి హైలైట్స్. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘మా సినిమాకు క్రౌడ్ సపోర్ట్ ఉంది.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల సపోర్ట్ కూడా ఉంటుందని నమ్ముతున్నా’’ అన్నారు శైలేష్ సన్నీ. ‘‘మా ట్రైలర్ చూస్తుంటే భావోద్వేగంగా ఉంది. ఈ సినిమాలోని పాయింట్ అందర్నీ ఆలోచింపజేస్తుంది. అశోక్‌గారు సినిమా చాలా బాగా తీశారు’’ అన్నారు జ్ఞానేశ్వరి. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి. -
టీడీపీలో సీట్ల సిగపట్లు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలోని అధికార పార్టీలో అంతర్గత పోరు అధికమవుతోంది. నేతల మధ్య వైరం తారస్థాయికి చేరుతోంది. సీట్ల కోసం సిగపట్లు తప్పేలా కనిపించడం లేదు. ఏ నియోజవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారోనన్న స్పష్టత లేకపోవడం.. సిటింగ్‌ల మార్పుపై జరుగుతున్న ప్రచారం టీడీపీ నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని మర్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో సిటింగ్‌ల మార్పు వ్యవహారం జిల్లా టీడీపీలో వర్గ విబేధాలను పతాక స్థాయికి చేర్చింది. తాజా పరిణామాలు సిటింగ్‌ల మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరింది. చంద్రబాబు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానంటూ టీటీడీ బోర్డు సభ్యుడు ఇన్ఫోటెక్‌కు చెందిన బోధనపు అశోక్‌రెడ్డి మంగళవారం మార్కాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అశోక్‌రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ మేరకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందన్న ప్రచారం ఉంది. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డిని ఒప్పించి అశోక్‌రెడ్డిని రాబోయే ఎన్నికల బరిలో నిలిపేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కొంత కాలంగా ఈ ప్రచారం ఉన్నా అశోక్‌రెడ్డి పూర్తి స్థాయిలో బయట పడలేదు. మంగళవారం మార్కాపురం వచ్చిన అశోక్‌రెడ్డి చంద్రబాబు ఆదేశిస్తే తాను పోటీ చేస్తానంటూ ప్రకటించి నుంచి తెరపైకి వచ్చారు. అశోక్‌రెడ్డి కందుల నారాయణరెడ్డి వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి కాశీనా«థ్ ఇంట్లోనే విలేకరుల సమావేశం పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి దొనకొండ జడ్పీటీసీ డాక్టర్ మన్నే రవీంద్ర, తర్లుపాడు మాజీ సర్పంచ్ కందుల కళావతి వర్గంతో పాటు మరి కొందరు ఎంపీటీసీలు, ముఖ్యనేతలు హాజరు కావడం గమనార్హం. ఎట్టకేలకు ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డి మార్కాపురంలో బరిలో తానున్నాంటూ ప్రకటించి ఆ పార్టీలో మరింత ఆజ్యం పోశారు. జరుగుతున్న తంతు చూస్తే కందులను తప్పించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కందుల వర్గం దీన్ని ఖండిస్తోంది. ఒక వేళ నారాయణరెడ్డిని కాదని ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డిని అభ్యర్థిగా నిలిపే పక్షంలో తాము వారికి మద్దతు ఇచ్చేది లేదని ఆయన వర్గం తేల్చి చెబుతోంది. కాదు కూడదని చంద్రబాబు అశోక్‌రెడ్డిని బరిలో నిలిపితే తాము పార్టీని వీడేందుకు సిద్దమని వారు తేల్చి చెబుతున్నారు. మొత్తంగా ఇన్ఫోటెక్ అశోక్‌రెడ్డి అభ్యర్థిత్వం తెరపైకి రావడంతో మార్కాపురం టీడీపీలో గొడవలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కనిగిరి బరిలో నిలిచేదెవరో.. కనిగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. చాలా కాలంగా ఈ ప్రచారం నడుస్తోంది. కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు యాదవ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబూరావును పక్కన పెట్టి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చవచ్చని టీడీపీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డిని కనిగిరి బరిలో నిలపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం ఉగ్ర నర్సింహారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రను టీడీపీ అభ్యర్థిగా నిలిపేందుకు సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ససేమిరా అంటున్నాడు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణతో కదిరి బాబురావుకు సన్నిí ßæత సంబంధాలు ఉన్నాయి. దీన్ని అడ్డుపెట్టి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ టిక్కెట్ గెలుచుకుంటానని కదిరి ధీమాతో ఉన్నాడు. అలా కాకుండా చంద్రబాబు ఉగ్ర నర్సింహారెడ్డికి టిక్కెట్ ఇస్తే ఆ పార్టీలో వర్గ విభేధాలు రోడ్డున పడనున్నాయి. ఎస్‌ఎన్‌పాడు తేలేదెప్పుడు? సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి మార్పు ఉంటుందని అధికార పార్టీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను తప్పించి కొత్త అభ్యర్థిని బరిలో నిలుపుతామని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన కొందరు స్థానిక టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజును సంతనూతలపాడు నుంచి పోటీ చేయించేందుకు ఆ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విజయ్‌కుమార్‌ను తప్పించాలంటూ అసమ్మతి వర్గం పలుమార్లు ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించింది. సంతనూతలపాడు నుంచి విజయ్‌కుమార్‌ను తప్పించే పక్షంలో ఆయన వర్గం టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడ టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. వై.పాలెంలో అభ్యర్థి కరువు.. యర్రగొండపాలెం నుంచి రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలిపేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే డేవిడ్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అధికార పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఆ నియోజకవర్గంలో డేవిడ్ రాజుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్సార్ సీపీకి కంచుకోటగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఫిరాయించిన డేవిడ్‌రాజును ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ప్రజలు ఛీత్కరించే అవకాశం ఉంది. దీన్ని నుంచి బయటపడేందుకు టీడీపీ ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచన మేరకే ఇక్కడ అభ్యర్థి నియామకం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. కొత్త అభ్యర్థిని నిలిపితే అతడి విజయానికి టీడీపీ పాత వర్గంతో పాటు డేవిడ్ రాజు వర్గం కూడా కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా పై నాలుగు సీట్లలో సిటింగ్‌ల మార్పు వ్యవహారం ఆపార్టీలో వర్గ విభేధాలను పతాక స్థాయికి చేర్చింది. -
కొంత లాభం ఊరి కోసం!
పంపిణీరంగంలో ఉన్నవారు నిర్మాతలుగానూ మారుతుంటారు. ఉదాహరణకు ‘దిల్’ రాజు ఒకరు. ఇప్పుడు పంపిణీ రంగం నుంచి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మాతలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఈ ఇద్దరూ ఓ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బ్యానర్ లోగోను నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, అశోక్ రెడ్డిలతో పాటు ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. ఈ బ్యానర్లో చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుందన్న విషయాన్ని ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ‘ఈ మాయ పేరేమిటో’ హీరో రాహుల్ విజయ్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘సురేశ్, అహితేజలు బ్యానర్ పెడుతున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యా. వీళ్లు పెద్ద ప్రొడ్యూసర్స్ కావాలి. ఈ బ్యానర్లో మంచి మంచి సినిమాలు రావాలి’’అన్నారు. ‘‘టీజర్, ట్రైలర్ చూడగానే సురేశ్, అహితేజలు ఆ సినిమా స్కేల్‌ను అంచనా వేయగలరు. వీళ్లకు ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ లైఫ్ ఉండాలి’’అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వీరిద్దరిలో ఒకరు బాధ్యతను గుర్తు చేస్తే, మరొకరు ధైర్యాన్ని ఇస్తారు. ఇటువంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం అన్నారు’’ చిన్నికృష్ణ. ‘‘వీళ్లు తప్పకుండా సక్సెస్ కావాలి’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడి వరకు రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సురేశ్ వర్మ. ‘‘నాకు సినిమా అంటే చిరంజీవిగారే. ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రవీణ్‌ను మిస్ అవుతున్నాను. మా మొదటి సినిమా నుంచే మాకు వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగు కోసం ఖర్చుపెడతాం’’ అన్నారు అహితేజ. -
బాగా లేదంటే డబ్బు వాపస్
కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి, హీరో హవీశ్ విడుదల చేశారు. నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ –‘‘నా భార్య నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ‘ఆర్ ఎక్స్ 100’ బైక్. అజయ్‌గారు కథ చెప్పినప్పుడు షాకయ్యాను. తర్వాత గ్రేట్‌గా ఫీలయ్యాను. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ మా సినిమా గురించి మాట్లాడుతుండటం గర్వంగా ఉంది. ‘7/జి బృందావన కాలనీ, సైరాట్, ప్రేమిస్తే’ సినిమాల్లో ఎంత కంటెంట్ ఉందో దానికి మించిన కంటెంట్ మా సినిమాలో ఉంటుంది. ఈనెల 12న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్న రోజుల్లో నాపై నమ్మకంతో నన్ను కలిసిన తొలి వ్యక్తి చైతన్ భరద్వాజ్. తర్వాత క్రమంగా ‘ఆర్ ఎక్స్ 100’ టీమ్ ఏర్పడింది. చాలా హానెస్ట్‌గా చేసిన సినిమా ఇది’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూశాక పెట్టిన డబ్బులు వేస్ట్ అయ్యాయని ప్రేక్షకులు అంటే వారికి నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా’’ అన్నారు కార్తికేయ. -
టైటిల్ వినగానే షాక్ అయ్యా – అశోక్ రెడ్డి
‘‘కథను నమ్మి తీసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడినా బూడిదలో పోసిన పన్నీరే. ట్రైలర్ చూసిన వారందరూ సినిమా హిట్ అంటున్నారు. రామ్‌కీగారు ఈ చిత్రంలో చక్కటి హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు’’ అని నటుడు రావు రమేశ్ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. కెసిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ –‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా ట్రైలర్ కొందరికి చూపించగానే తమిళ సినిమా ట్రైలర్‌లా ఉందన్నారు. రా నేటివిటీ మూవీస్ తమిళ్, మలయాళ వాళ్ల సొంతమా? తెలుగులో తీయలేమా? అనిపించి ఈ సినిమా తీశా. మన నేటివిటీని మనం పట్టుకోం. ఎందుకంటే తెలుగు సినిమాలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్ని దాటి వెళ్లిన సినిమా ఇది. ఇన్క్రెడిబుల్ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘అజయ్‌గారు నాకు స్టోరీ చెబుతూనే సినిమా చూపించేశారు. రెండు గంటలు స్టోరీ చెప్పారు. టైటిల్ ‘ఆర్ఎక్స్ 100’ అనగానే నేను షాక్. ఎందుకంటే నా లైఫ్‌లో ఫస్ట్ బైక్ అది. స్టోరీకి తగ్గ టైటిల్. యంగ్ జనరేషన్ అంతా ఈ సినిమాకి రిలేట్ అవుతారు. డైరెక్టర్ చాలా హార్డ్ వర్కర్. ఆయన్ని మేమంతా పని రాక్షసుడు అంటాం’’ అన్నారు అశోక్‌రెడ్డి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, నటుడు రామ్కీ తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి
సాక్షి, గిద్దలూరు : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం వెలగలపాయగ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతున్న సమయంలో అశోక్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో నాలుగైదు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది యువకులపై చేయి చేసుకోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు విసిరేశారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురు యువకులపై దాడికి దిగారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎవరో ఆకతాయిలు మద్యం మత్తులో కోడిగుడ్లు విసురుకున్నారని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
నల్లధనం సౌదీకి తరలించిన చరిత్ర కేసీఆర్‌ది..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నల్లబెల్లి(నర్సంపేట): ఫాంహౌజ్‌లో దాచుకున్న కోట్లాది రూపాయల నల్లధనాన్ని సౌదీ అరేబియాకు తరలించుకున్న చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో టీజేఏసీ నాయకుడు వేముల రాజు పోరు బిడ్డల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం ప్రకటించిన అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయగానే దివాళాకోరు పనిగా అభివర్ణించిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోతోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి కొలువులు కల్పించారని ఎద్దేవా చేశారు. మోసపురిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీక్షలకు బీజేపీ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజుకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త దశరథం, రేవూరి రాజేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి సంఘీబావం తెలపగా టీ జేఏసీ నాయకులు వేముల రాజు, కోల లింగయ్య, ఎన్నమల నర్సయ్య, వడ్లురి సత్యం, నాగంపెల్లి వీరన్న, పబ్బోజు నర్సింహచారి, వంగ ఉపేందర్, బోజ్య, హచ్చు కూర్చున్నారు. -
‘కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయి’
► బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి ► పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవం వరంగల్: రాష్ట్ర కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించని సీఎం కేసీఆర్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని సీఎం వైఖరిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. సన్మానం... కార్యక్రమంలో భాగంగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, తక్కెళ్లపల్లి శ్రీదేవి, భవాని, సంగీతలను జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రూరల్, అర్బన్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు ముత్యాల శ్రీనివాస్, గురుమూర్తి శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త దశరథం, పార్లమెంటు కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, సదానందంగౌడ్, రామచంద్రారెడ్డి, గుండెమీది శ్రీనివాస్, చీర్ల కిరణ్‌రెడ్డి, మేకల రాజవీరు, తాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిర్ల కిరణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోల్తి రవికుమార్, పోతరాజు అశోక్, నరేష్, త్రిలోకేశ్వర్, ఠాగూర్ రవీందర్‌సింగ్, కక్కెర్ల శివ, టాక రాజు, మహేందర్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటి పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ రాష్ట్రానికి 90 వేల ఇళ్లు మంజూరు చేస్తే రెండింటిని ఒకటిగా చేసి డబుల్ బెడ్రూం అని చెప్పి 45 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారన్నారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. 2019 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ మెడికల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, యువమోర్చా జిల్లా కిరణ్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సయ్య, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రవి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ జెండా మోసినవారిని తొక్కేస్తున్నారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తొక్కేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నా రాంబాబును కోరారు. కార్యకర్తల ఒత్తిడితో అన్నా రాంబాబు.. అశోక్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. -
జిల్లాల పునర్విభజన పేరుతో కేసీఆర్ నాటకాలు
వరంగల్‌ను విడగొట్టాలనే ఆలోచన రావడం దురదృష్టకరం ∙బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పరకాల : జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం కేసీఆర్ మూడు నాలుగు నెలల నుంచి నాటకాలు ఆడుతున్నా రని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తే మంచిదేకానీ.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ట్రైసిటీగా కొనసాగుతున్న కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాలను విడగొట్టాలనే ఆలోచన రావడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు కరీంనగర్, కరీంనగర్లో ఉన్న ఈటెల రాజేందర్‌కు హన్మకొండను అప్పగించడం కోసమే సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన వరంగల్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన తిరంగ యాత్ర సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరకాల అమరధామంకు రానున్నారని ఆయన పేర్కొన్నారు. -
తుగ్లక్‌లా సీఎం కేసీఆర్
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హన్మకొండ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. 23 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఓ సారి.. 27 జిల్లాలని మరోసారి చెప్పడం... జిల్లా కేంద్రం, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామనడం ఔరంగజేబు రాజధానులను మార్చినట్లుగా ఉందని దుయ్యబట్టారు. జిల్లా చేయాలని కోరుతున్న జనగామను కాకుండా హన్మకొండను జిల్లా చేస్తామనడం, జిల్లా కేంద్రాన్ని ముక్కలు చేస్తామనడం సరికాదన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు ఎగుర వేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి, నాయకులు కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, చదుపట్ల కీర్తి పాల్గొన్నారు. -
గిద్దలూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీలో విభేదాలు బుధవారం భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేరికపై టీడీపీ నేత అన్నా రాంబాబు వర్గం నిప్పులు చెరుగుతోంది. తమ కార్యకర్తలను ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నా రాంబాబు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఫిర్యాదు చేసేందుకు దాదాపు 600 మంది కార్యకర్తలతో అన్నా రాంబాబు బుధవారం ఒంగోలు తరలివెళ్లారు. -
మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రిపదవిని కూడా వదులుకుని వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు. తాను అసలు టీడీపీ నేతలతోనే మాట్లాడనప్పుడు.. వాళ్లకు ఆ పార్టీలోకి వస్తానని హామీలు ఎవరిచ్చారో తెలియదని చెప్పారు. ఇక తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. తామంతా శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని ఆయన అన్నారు. -
'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి'
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు, తాగునీటి సమస్యలపై అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, జంకె వెంకట్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వారు అధికారులను ఆదేశించారు. -
ఓ స్త్రీ రేపురా...
గతంలో కొన్ని గ్రామాల్లో దెయ్యం తిరుగుతుందనే భయంతో ఇంటి గోడలపై ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాశారు. ఆ ఘటనల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా తీసిన చిత్రం ‘ఓ స్త్రీ రేపురా’. అశోక్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, వంశీ కృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షా పంత్ తదితరులు నటించారు. ఘంటశాల విశ్వనాథ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ‘మధుర’శ్రీధర్ ఆవిష్కరించారు. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తామని అశోక్‌రెడ్డి తెలిపారు. -
బెల్టుతో భార్యను హతమార్చిన భర్త
ఉస్మానియా యూనివర్సిటీ: తాగిన మైకంలో ఓ భర్త ... భార్య మెడకు బెల్టు బిగించి హత్య చేసిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన ఇషాసింగ్ (30)తో చాదర్‌గట్‌కు చెందిన నగర నివాసి మిర్జాహుస్సెన్‌అలీ (34) ఎనమిది సంవత్సరాల క్రితం ప్రేమా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. హబ్సిగూడ వీధినంబర్.8లో ఇండిపెండెంట్ హౌజ్‌లో ఉంటు రోలింగ్ షట్టర్స్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. గత కొంత కాలం భార్య, భర్తల మధ్య చిన్న చితక విషయాలకు గొడవలు ప్రారంభమైనవి. బుధవారం ఇషాసింగ్ తన పిల్లను కొట్టింది. పిల్లలను ఎందుకు కొట్టావని భర్త గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. అప్పటికె తాగి ఉన్న భర్త మిర్జాహుస్సెన్‌అలీ నడుముకు గల బెల్టును భార్య మెడకు బిగించి చనిపోయోవరకు గట్టిగా లాగాడు. ఊపిరాడని ఇషాసింగ్ అప్పటికప్పుడే మతి చెందింది. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి భర్త మిర్జాహుస్సెన్‌అలీని అరెస్ట్ చేసి ఇషాసింగ్ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
నేడు ఢిల్లీకి బీజేపీ బృందం
జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులే లక్ష్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నయీంనగర్: జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించేందుకు ఓరుగల్లు నుంచి 23 మంది ప్రతినిధులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలో బీజేపీ బృందం ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10,11,12 తేదీల్లో ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి పలు కొత్త పథకాల అమలు కోసం నిధులు మంజూరు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో నీటి పారుదల ప్రాజెక్ట్, టెక్స్టైల్ పార్క్‌ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం విన్నవిస్తామని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ, మల్లంపెల్లి, మానుకోట వద్ద సిమెంట్, ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. హృదయ్ పథకంలో మహబూబాబాద్‌ను చేర్చాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐ.ఐ.ఎం.ఏర్పాటు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం అంశంపై కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చిస్తామని వివరించారు. ఒడిశా నుంచి తెలంగాణ వరకు నిర్మించే ఆయిల్ టర్మినల్లో భాగంగా వరంగల్‌లో 94కోట్ల తో ఆయిల్ టర్మినల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అనంతరం ఆయన పలు అంశాలపైనా మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడంతో గీతకార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కరువుపై క్షేత్రస్థారుులో అధ్యయనం చేయూలన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను సీఎం హేళన చేయడం సరికాదని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని కోరారు. 15న ఆందోళనలు చేస్తాం ఈ నెల 15న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ చెల్లింపు కోసం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను నియమించాలని సీఎంను కోరారు. పార్టీ నాయకులు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రాద్రి రాంచంద్రారావు,మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి కూచన రవళి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా... బాబు మోసాలను ఎండకడదాం
5న జరిగే మహాధర్నాలో కార్యకర్తలు,{పజలు పాల్గొనాలని పిలుపు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఒంగోలు అర్బన్: ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా మాట నిలబెట్టుకోలేదు. మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఐదో తేదీన (శుక్రవారం) కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ఒంగోలులోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చి అయిదు నెలల కాలంలో ఏభైమోసాలు చేశారని ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీపై పూటకో కట్టుకథ చెబుతున్నారని, అదేవిధంగా డ్వాక్రా రుణాలపై కూడా స్పష్టమైన వైఖరి అవలంభించడం లేదన్నారు. పేదలకిచ్చే పింఛన్లను వెయ్యి రూపాయలకి పెంచుతున్నామని చెబుతూ మరోవైపు జిల్లాలోనే 45 వేల మందిని అనర్హులుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే చంద్రబాబునాయుడి అసలు రూపం బట్టబయలైందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు రైతులని, డ్వాక్రా మహిళలని రుణ గ్రస్తులని చేశాడని మండిపడ్డారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తీసివేశారని విమర్శించారు. బాబు వచ్చాడు జాబు పోయిందనే విధంగా ఆయన పాలన ఉందన్నారు. చివరికి బెల్టు షాపులు అరికట్టడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. 70 సంవత్సరాలు దాటిన వృద్ధులను కూడా అనర్హులుగా చూపించి ఇస్తున్న 200 రూపాలయల ఫించను కూడా తీసేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని, ఆ మోసాలను ఎండకట్టడానికే వైఎస్ఆర్సీపీ మహాధర్నాని చేపట్టిందని వివరించారు. చివరికి రేషన్ కార్డులు కూడా తీసేయడం పేదల పొట్టకొట్టడమేనన్నారు. మేలు చేస్తాడని నమ్మిన ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు దుర్మార్గాలను బయటపెట్టే నేపధ్యంలో చేపట్టే ఈ ధర్నాలో బాధితులంతా పాల్గొని వంచనని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ శనగ రైతుల విషయంలో చంద్రబాబు నయవంచన చేశాడని ఆగ్రహం వెలిబుచ్చారు. రుణమాఫీ విషయంలో శనగై రెతులకి ఎన్నో ఆంక్షలు పెట్టి కనీసం శనగ నిల్వలు అమ్ముకొనే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం బాధకరమని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కటారి రామచంద్రరావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసే రోజునే ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంతోపాటు హామీలివ్వని ఎన్నో సంక్షేమ కార్యాక్రమాలు చేపట్టారని, ఆయన ఆదర్శంతో చంద్రబాబు కొంతైనా మారాలని అన్నారు. సమావేశంలో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ కన్వీనర్ కటారి శంకర్, విజయవాడ ఇన్‌ఛార్జి వై. వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ కంచర్ల సుధాకర్, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలోకి ఆగంతకుడు
* ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం ధ్వంసం * సాయుధ పహరా కళ్లుగప్పి.. గేటు దూకి వెళ్లిన అశోక్‌రెడ్డి * ప్రవేశ ద్వారం తలుపులు ముక్కలు ముక్కలు చేసిన వైనం * ఆగంతకుడిని వాచ్మన్లు గుర్తించటంతో అప్రమత్తం.. అరెస్ట్ * అశోక్‌రెడ్డికి మతి స్థిమితం లేదని చెప్తున్న కుటుంబసభ్యులు * ఘటనపై దర్యాప్తు - శాసనసభ భద్రత మరింత కట్టుదిట్టం సాక్షి, హైదరాబాద్: నిరంతరం మూడంచెల సాయుధ పోలీసులు పహరా ఉండే అసెంబ్లీ భవనంలోకి ఒక అగంతకుడు ప్రవేశించి ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఘటన అనంతరం స్పందించిన పోలీసులు ఆ అగంతకుడిని పట్టుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పస్రకు చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి.. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉండే అసెంబ్లీ భవనంలోకి ఆరు అడుగులకు పైగా ఎత్తుండే ఒకటో నంబరు గేటు ఎక్కి ప్రవేశించాడు. ఈ గేటు వద్ద 24 గంటలూ సాయుధ పోలీసులు పహరాకాస్తుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ కార్యదర్శులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం గేటు తెరుచుకుని.. లోపలకు వెళ్లి ఎమ్మెల్యేల ప్రవేశద్వారాన్ని ధ్వంసం చేశాడు. అశోక్‌రెడ్డి దెబ్బకు కలపతో చేసిన ఆ ద్వారంలోని రెండు తలుపుల్లో ఒకటి ముక్కలు ముక్కలై నేలపై పడింది. ఆ ద్వారానికి ఉండే అద్దం కూడా ధ్వంసమైంది. ధ్వంసమైన ద్వారం గుండా సమావేశ మందిరంలోకి ప్రవేశించిన అశోక్‌రెడ్డి కొద్దిసేపు అక్కడి ఉండి ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. ఈ సమయంలో గమనించిన అసెంబ్లీ వాచ్మన్లు అతడిని ప్రశ్నించే సరికి పొంతన లేని సమాధానాలివ్వడంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్‌కు సమాచారం అందించారు. ఆయన హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకుని ద్వారం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు పాల్పడిన అశోక్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గౌరీనగర్‌లో నివాసం ఉంటున్న అశోక్‌రెడ్డి పూర్వాపరాలను ఆయన భార్యను విచారించి తెలుసుకున్నారు. ఆ తరువాత డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అశోక్‌రెడ్డి మానసికస్థితి బాగోలేదని, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు చెప్పారని వివరించారు. అశోక్‌రెడ్డి ఒకటో నంబరు గేటు నుంచి అసెంబ్లీ భవన సముదాయంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీలో రికార్డైందని వివరించారు. అశోక్‌రెడ్డిపై 447, 427 పబ్లిక్ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పగడాల అశోక్ చెప్పారు. ఘటన అనంతరం అసెంబ్లీ ఆవరణలో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ధ్వంసమైన ద్వారాన్ని పరిశీలించే ందుకు ఎవరినీ అనుమతించలేదు. అసెంబ్లీ సమావేశ మందిరానికి మరమ్మతులు టేకుతో తయారైన ద్వారాన్ని ఎలాంటి పరికర సాయం లేకుండా ధ్వంసం చేయటం సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ అశోక్‌రెడ్డి మానసిక వికలాంగుడై కాళ్లు లేదా చేతులతో తన్ని ద్వారాన్ని ధ్వంసం చేశారని అనుకున్నా ఆయన శరీరంపై ఎలాంటి గాయా లు లేవు. ఆ సమయంలో శబ్దం కూడా రాలేదు. ప్రస్తుతం సమావేశ మందిరంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఉపయోగించే సామాగ్రిని ఏమైనా ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలావుంటే సంఘటన గురించి అసెంబ్లీ అధికారులు విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించినట్లు సమాచారం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడు
హైదరాబాద్ : అసెంబ్లీ ద్వారాన్ని పగులగొట్టిన ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఘటనాస్థలాన్ని సందర్శించి అసెంబ్లీ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వరంగల్ జిల్లాకు చెందిన అశోక్‌రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు అతడు మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడని చెప్పారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 6 వద్ద తలుపులను పగలగొట్టాడని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ద్వారాన్ని బయట వ్యక్తులు బద్దలు కొట్టడం అసెంబ్లీకి భద్రత లేదనటానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మా నేతలపై కేసులు బనాయిస్తున్నారు: వైఎస్సార్సీపీ
ఏపీ డీజీపీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా తమ పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షుడు మరణించిన తరువాత కూడా తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలసి సంఘటన వాస్తవాలను వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. గిద్దలూరులో గత నెల 30వ తేదీన సహకార సంఘ అధ్యక్షుడు వై. భాస్కరరెడ్డి మృతికి కారణమైన ఎస్ఐని వెంటనే సస్సెండ్ చేసి ఆరెస్టు చేయాలని డీజీపీని కోరారు. -
రుణమాఫీపై బాబుకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె, డేవిడ్‌రాజు, ముత్తుముల ధ్వజం మార్కాపురం టౌన్ : రైతుల రుణమాఫీపై సీఎం చంద్ర బాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూశానని, రుణమాఫీతో వారి కష్టాలు తీరుస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇవ్వకుండానే రైతుల రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం చేజిక్కించుకునేందుకు బాబు సాధ్యం కాని హామీలిచ్చారని, దీన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందే పసిగట్టారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిమితులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చెబుతుండగా అక్కడి టీడీపీ శాసనసభ్యులు మాత్రం రైతులపై ఉన్న రుణాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో రైతుల రుణమాఫీపై పట్టుబడతామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తామన్నారు. దాడులు చేస్తే సహించేది లేదు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు న్యాయం పక్షాన నిలవాలని కోరారు. తొలుత ఆర్డీఓ కొండయ్య, డీఎస్పీ రామాంజనేయులును కలిసి పశ్చిమ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ముత్తుముల, జంకె విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి, దోర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, గాలి రమణారెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దప్పిలి విజయభాస్కరరెడ్డి, బి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే.. జిల్లాలో ఫ్యాను గుర్తుపై గెలుపొందిన 31 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్ సీపీలోనే ఉన్నారని, ఎవరూ టీడీపీలోకి వెళ్లలేదని మార్కాపురం, త్రిపురాంతకం జెడ్పీటీసీలు జవ్వాజి రంగారెడ్డి, చంద్రమౌళిరెడ్డి తెలిపారు. జిల్లా జెడ్పీ పీఠం తమదేనని చెప్పారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా తమ పార్టీలోకి వస్తున్నారని టీడీపీ నాయకులు దుష్ర్పచారం చేయడంపై మండిపడ్డారు. -
బాబుతో దోస్తీ.. బాధించిం
పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నా.. తెలంగాణ ద్రోహి చంద్రబాబు సిగ్గులేకుండా బీజేపీ అధిష్టానం వద్ద మోకరిల్లాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కేసముద్రం, న్యూస్‌లైన్ : సమైక్యవాద టీడీపీతో తమ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని... ఇందుకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి చంద్రబాబు బీజేపీ హైకమాండ్ వద్ద మోకరిల్లి సిగ్గులేకుండా పొత్తుకుదుర్చుకున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే చచ్చిపోయిన టీడీపీని కాస్త బతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాడని, తమ పార్టీ నేత వెంకయ్యనాయుడుతో ఈ పొత్తును ఖరారు చేయించుకున్నాడని మండిపడ్డారు. టీడీపీతో ఎన్నికల్లోకి పోతే బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. ఒకప్పుడు మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో తాము పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పుచేశానన్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఏ తప్పు చేసి పొత్తుపెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తాము పార్టీ అధిష్టానం వద్ద పొత్తువద్దని, సమైక్యవాద పార్టీతో పొత్తుపెట్టుకుంటే నష్టపోతామని చెప్పినా.. చివరకు పొత్తుపెట్టుకోవడం తనను మనస్థాపానికి గురిచేసిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, కనీసం పార్టీ నుంచి పావులా బిళ్ల కూడా ఇవ్వనప్పటికీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి స్వతహాగా ఖర్చుపెట్టుకుని తమ కార్యకర్తలు,నాయకులు పని చేశారని, అలాంటిది తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం బాధించిందన్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ప్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం నిజం తెలుసుకోవాలని కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లబు వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భుక్యా బాలునాయక్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కందునూరి నగేష్‌గౌడ్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. -
మోసం చేయడమే బాబు నైజం
తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : మోసం చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంలో బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటుందని, పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేసిందని వివరించారు. ఈ మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి లోక్‌సభలో మద్దతు తెలిపామని స్పష్టం చేశారు. రాజ్యసభలో కూడా మద్దతు తెలుపుతున్నామన్నారు. కాగా, సంపూర్ణ తెలంగాణ కోసం నల్లగొండ జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి గిరిబాబు ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కల సాకారమవుతున్న ఈ సమయంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని అశోక్‌రెడ్డి సూచించారు. వెంకయ్యనాయుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే.. వెంకయ్యనాయుడుకు సొంత అభిప్రాయమున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు మద్దతు ఇచ్చిందన్నారు. టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకుని పార్టీ దెబ్బ తిందని, ఈసారి పొత్తు పొట్టుకునేది లేదని, ఇదే అంశాన్ని జాతీ య నాయకత్వానికి చెప్పామని వివరించారు. తెలంగాణలో బీజేపీ పటిష్టంగా ఉండాలంటే పొత్తు అవసరం లేదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీరాముల మురళీమనోహర్, తాళ్లపల్లి కుమారస్వామి, కొత్త దశరథం, మారెపల్లి రాంచంద్రారెడ్డి, ఉషాకిరణ్, దుప్పటి భద్రయ్య, చిలుక విజయారావు, ఎన్.యాకయ్య, అడప బిక్షపతి, త్రిలోకేశ్వర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహిళల పట్ల ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు
వెల్దుర్తి, న్యూస్‌లైన్ : చెరువులో చేపలు పట్టే విషయంలో ఓ వర్గం మహిళలపై స్థానిక ఎస్ఐ అశోక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం మండల పరిధిలోని ఎలుకపల్లికి చెందిన ముది రాజ్ కులస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భం గా ఎస్ఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయం లో విచారణ చేయిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కాన్చెరువు (చేపల కోసం) హక్కులపై ఎలుకపల్లికి చెందిన ముదిరాజు లు, వెల్దుర్తికి చెందిన గంగపుత్రుల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. అయితే వారం రోజుల క్రితం చెరువులో చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిరాజ్‌లను ఎస్ఐ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం స్థానిక ఎస్ఐ పో లీసుల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య చెరువులో ఉన్న చేపలను గంగపుత్రులు వేటాడారు. అయితే మిగిలిన ముదిరాజ్ లు, మహిళలు దీనిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఇందుకు ఆగ్రహించిన ఎస్ఐ సదరు కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశా రు. అనంతరం ముదిరాజ్ కులస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంత రం సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని వెనుతిరిగారు. గురువారం ముదిరాజ్‌లను రిమాండ్‌కు తరలిస్తుండగా సదరు కులస్తులతో పాటు వెల్దుర్తి సర్పంచ్ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తోట నరసింహులు, ఉపసర్పంచ్ వెంకటేష్‌లు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ మో హన్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండతో నిరుపేదలైన ముదిరాజులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహా నికి గురైన ఎస్ఐ సర్పంచ్‌ని తీవ్రంగా దూర్భాషలాడారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి వె ల్దుర్తి పట్టణాన్ని బంద్ చేయించి బ స్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎస్ఐ దిష్టిబొమ్మతో అంబేద్కర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్విహ ంచి అక్కడ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అయితే విష యం తెలుసుకున్న తూప్రాన్ సీఐ సం జయ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఎస్ఐ మహిళలపై అనుచిత వాఖ్యలు చేశారని, బాంబులు వేసి ఇళ్లను ధ్వం సం చేస్తానని హెచ్చరించారని ఆరోపిం చారు. మంత్రి సునీతారెడ్డికి బంధువునంటూ అమాయక ప్రజలను వేధిస్తున్నాడని, తక్షణమే ఎస్ఐపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎస్ఐపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన కారులు శాంతించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. హక్కులు ముదిరాజులకే : సర్పంచ్ పంచాయతీ పరిధిలో 20 చెరువులు, కుంటలు ఉండగా పంచాయతీ అభివృ ద్ధి కోసం వేలం పాటలు చేశామని సర్పంచ్ మోహన్‌రెడ్డి తెలిపారు. 18 చెరువు, కుంటలకు గంగపుత్రులకు కే టాయించి.. కాన్ చెరువు ముదిరాజుల కు, నర్సిన్ చెరువు ఎస్సీలకు కేటాయించామన్నారు. ఎస్ఐ అతిగా ప్రవర్తిస్తూ పోలీసు బలగాలతో కాన్‌చెరువులో అక్రమంగా గంగపుత్రులచే దగ్గరుండి చేపలు పట్టించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు. తండ్రి రిమాండ్‌తో సొమ్మసిల్లిన కుమార్తె చేపల వేటకు వెళ్లిన ముదిరాజలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గుడ్డివాడైన కానికే అంజయ్యను రిమాండ్‌కు తరలించడంతో ఆయన కుమార్తె మంజుల సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను తోటి మహిళలు ఆస్పత్రికి తరలించారు. డీపీఓ ఆదేశాల మేరకే బందోబస్తు ఇచ్చాం కాన్చెరువు హక్కులు గంగపుత్రులకే ఉంటాయని డీపీఓ ఆదేశాల మేరకే గంగపుత్రులు కాన్‌చెరువులో చేపలు పట్టడానికి బందోబస్తు ఇచ్చామని తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, స్థానిక ఎస్ఐ అశోక్‌రెడ్డిలు తెలిపారు. కాన్చెరువుపై గంగపుత్రులకు పూర్తి హక్కు ఉంటుందని సర్పంచ్‌కు డీపీఓ నోటీసులు కూడా పంపారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7న కాన్‌చెరువులో ముదిరాజులు చేపల వేట సాగిస్తున్నారని గంగపుత్రులు తమకు ఫిర్యాదు చేయగా అక్రమంగా చేపలు పడుతున్న ముదిరాజులైన మల్లయ్య, అంజయ్య, స్వామి, భాగయ్య, పోచయ్య, అంజయ్య, మైసయ్య, యాదగిరి, కిష్టయ్యలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
సోలార్ సిస్టంను పరిశీలించిన అధికారులు
రహీంఖాన్‌పేట(ఆత్మకూరు(ఎం), న్యూస్‌లైన్: విద్యుత్ కొరత నుంచి గట్టెక్కడానికి మండలంలోని రహీంఖాన్‌పేటలో రైతు కొత్త అశోక్‌రెడ్డి సొంత పరిజ్ఞానంతో తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టంను ఆదివారం ట్రాన్స్‌కో ఏఈ రాజేందర్‌సింగ్, వికారాబాద్ సీఐ వెంకట్రాంరెడ్డితో పాటు పలువురు రైతు లు పరిశీలించారు. సోలార్ సిస్టం ఏర్పా టు చేసిన విధానం గురించి వారు రైతును అడిగి తెలుసుకున్నారు. అశోక్‌రెడ్డి సాంకేతిక నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు. విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకే.. విద్యుత్ సమస్యనుంచి గట్టెక్కేందుకే సొంత పరిజ్ఞానంతో సోలార్ సిస్టం ఏర్పా టు చేశానని రైతు ఆశోక్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 10 సోలార్ పీవీ ప్యానెల్ మ్యాడుల్ బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు డీసీ(డెరైక్ట్ కరెంట్), ఏసీ(ఆల్టర్నేట్ కరెంట్) స్టాటర్‌ను రూపొందించినట్లు చెప్పారు. వీ టి కొనుగోలుకు సుమారు * 2.50 లక్షలు ఖర్చు వచ్చిందన్నారు. సోలార్ సిస్టం నుంచి ఉత్పత్తయ్యే కరెంట్ ద్వారా 5 హెచ్‌పీ మోటార్ నిరంతరాయంగా నడుస్తుందన్నారు. పంప్‌సెట్ మోటార్ పగలం తా సోలార్ సిస్టంతో, రాత్రి కరెంట్ సహా యంతో నడుస్తుందని వివరించారు. తనకున్న మూడున్నర ఎకరాల్లో ఎకరంన్నర తరి, రెండు ఎకరాలలో దానిమ్మ తోట సాగు చేశానని.. కరెంట్ సమస్యను అధిగమించడానికే సోలార్ ప్రయోగం చేశా నని అధికారులకు వివరించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి 50 శాతం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహిస్తే కరెంట్ సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. సోలార్ సిస్టంను సందర్శిం చిన వారిలో అధికారులతో పాటు రైతులు ఏనుగు జితేందర్‌రెడ్డి, కొత్త అనంతరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పిన్నింటి మోహన్‌రెడ్డి, కొత్త భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అంధకారంలో తండాలు
మనూరు, న్యూస్‌లైన్: శేరిదామర్‌గిద్ద పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్, గట్టుమీది తండాలు అంధకారంలో మగ్గుతున్నాయి. 20 రోజులుగా విద్యుత్ సరఫరా జరగడంలేదని తండావాసులు శుక్రవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మూడు తండాలకు కలిపి బిక్యానాయక్ తండాలో ఒకే సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంవల్ల లోడ్ ఎక్కువై మాటిమాటికి ట్రిప్ అవుతుందన్నారు. దీంతో బిక్యానాయక్ తండావాసులు తమ తండాలకు విద్యుత్‌ను నిలిపి వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై రోజులుగా అంధకారంలో మగ్గుతున్నామని వారు వాపోతున్నారు. అధికారుల ఇప్పటికైనా స్పందించి మరో సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌రెడ్డి ద ృష్టికి తీసుకెళ్లగా సమస్య తన దృష్టికి రాలేదని, పరిశీలించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. -
వాయిదాలకు హాజరయ్యేపక్షంలో.. అభ్యంతరం లేదు
బెయిల్ షరతులు సడలించాలన్న సాయిరెడ్డి పిటిషన్‌పై సీబీఐ విచారణ రేపటికి వాయిదా... జగన్ పిటిషన్‌పై 18న విచారణ సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరయ్యే పక్షంలో.. హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న ఆయన బెయిల్ షరతులను సడలించినా తమకు అభ్యంతరం లేదని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. కర్ణాటక, తమిళనాడులోని తన ఆడిటింగ్ కార్యాలయాలకు వెళ్లడానికి వీలుగా ఈ నెల 17 నుంచి నవంబర్ 30 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించా రు. వృత్తిపరమైన విధులు నిర్వహించేందుకు బెయిల్ షరతులను రెండు పర్యాయాలు ఇదే కోర్టు సడలించిందని సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి నివేదించారు. కోర్టు విధించిన షరతులను ఎప్పుడూ ఉల్లంఘించలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ప్రత్యేక కోర్టును సీబీఐ అభ్యర్థించింది. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. -
ఓటరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రం ముందంజ : భన్వర్‌లాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదులో మన రాష్ట్రమే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఓటర్లకు బహుళ ప్రయోజనాలతో స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పారు. ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ ఓటరు నమోదు వాహనాన్ని భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఓటింగ్ నమోదుపై విస్తృత ప్ర చారం అవసరమని చెప్పారు. దేశం లో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 59 శాతం ఆన్లైన్ ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్లు అందాయని తెలిపారు. మొబైల్ వాహనాలతో అవగాహన ఓటరు నమోదు కార్యక్రమంలో అవగాహన కల్పించేందుకు ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. వివిధ సం స్థల కార్యాలయాల వద్దకే వెళ్ళి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతామని ఇన్ఫోటెక్ చైర్మన్ అశోక్‌రెడ్డి తెలిపారు.