అజయ్ భూపతి, పాయల్, కార్తికేయ, రామ్‌కీ, రావు రమేశ్, అశోక్ రెడ్డి, సిరాశ్రీ
‘‘కథను నమ్మి తీసిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడినా బూడిదలో పోసిన పన్నీరే. ట్రైలర్ చూసిన వారందరూ సినిమా హిట్ అంటున్నారు. రామ్‌కీగారు ఈ చిత్రంలో చక్కటి హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు’’ అని నటుడు రావు రమేశ్ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. కెసిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ –‘‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ట్రైలర్ కొందరికి చూపించగానే తమిళ సినిమా ట్రైలర్‌లా ఉందన్నారు. రా నేటివిటీ మూవీస్ తమిళ్, మలయాళ వాళ్ల సొంతమా? తెలుగులో తీయలేమా? అనిపించి ఈ సినిమా తీశా.
మన నేటివిటీని మనం పట్టుకోం. ఎందుకంటే తెలుగు సినిమాలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్ని దాటి వెళ్లిన సినిమా ఇది. ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘అజయ్‌గారు నాకు స్టోరీ చెబుతూనే సినిమా చూపించేశారు. రెండు గంటలు స్టోరీ చెప్పారు. టైటిల్ ‘ఆర్‌ఎక్స్ 100’ అనగానే నేను షాక్. ఎందుకంటే నా లైఫ్‌లో ఫస్ట్ బైక్ అది. స్టోరీకి తగ్గ టైటిల్. యంగ్ జనరేషన్ అంతా ఈ సినిమాకి రిలేట్ అవుతారు. డైరెక్టర్ చాలా హార్డ్ వర్కర్. ఆయన్ని మేమంతా పని రాక్షసుడు అంటాం’’ అన్నారు అశోక్‌రెడ్డి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, నటుడు రామ్‌కీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment