ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Maruthi Nagar Subramanyam Movie OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

MaruthiNagar Subramanyam OTT: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Published Fri, Sep 13 2024 5:54 PM | Last Updated on Fri, Sep 13 2024 5:54 PM

Maruthi Nagar Subramanyam Movie OTT Release Date Latest

రావు రమేశ్ అంటే సహాయ పాత్రలు, విలన్ పాత్రలే గుర్తొస్తాయి. తనదైన యాక్టింగ్‌తో తెలుగులో ఓ మార్క్ సృష్టించాడు. ఇన్నాళ్లు ఇతడు సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ రీసెంట్‌గా హీరోగానూ మెప్పించాడు. ఈయన్ని ప్రధాన పాత్రధారిగా పెట్టి 'మారుతీనగర్ సుబ్రమణ్యం' అనే మూవీ తీశారు. గత నెలల్లో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయింది.

(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)

రావు రమేశ్ లీడ్ రోల్ చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇ‍ప్పుడు సెప్టెంబరు 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'మారుతీనగర్ సుబ్రమణ్యం' విషయానికొస్తే.. మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని పట్టుబట్టి ఖాళీగా ఉండిపోతాడు. ఊరి నిండా అప్పులు. ఇలా జీవితం సాగిస్తున్న సుబ్రమణ్యం అకౌంట్‍‌లో ఓ రోజు రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇవి వేసింది ఎవరు వేశారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement