Maruthi Nagar Subramanyam Movie
-
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం థియేటర్లలోకి 'దేవర' రానుంది కాబట్టి ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరూ ఓటీటీల్లో కొత్తగా ఏమొచ్చాయా అని చూస్తారు. అలా వాళ్ల కోసమా అన్నట్లు ఈ శుక్రవారం ఏకంగా 22 మూవీస్/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)ఈ వీకెండ్ ఓవరాల్‌గా 24 సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామి, పెచీ, సాలా, కాఫీ, రుస్లాన్ తదితర సినిమాలతో ద మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ కాస్తోకూస్తో కనిపిస్తున్నాయి. అయితే వీటిలో మారుతీనగర్ సుబ్రమణ్యం, పెచీ, రుస్లాన్ మూవీస్ మాత్రమే చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 20)నెట్ఫ్లిక్స్బ్లడ్ లెగసీ - ఇంగ్లీష్ సిరీస్హిజ్ త్రీ డాటర్స్ - ఇంగ్లీష్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 - హిందీ రియాలిటీ షో (సెప్టెంబరు 21)క్లాస్ 95: ద పవర్ ఆఫ్ బ్యూటీ - స్పానిష్ సిరీస్మోరిసన్ - థాయ్ సినిమానో మోర్ బెట్స్ - మాండరిన్ మూవీఅమెజాన్ ప్రైమ్పెచీ - తమిళ సినిమాతలైవేట్టాయామాపాళ్యం - తమిళ సిరీస్ద ట్రాజికల్లీ హిప్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ - తెలుగు సిరీస్ద జడ్జి ఫ్రమ్ హెల్ - ఇంగ్లీష్ సిరీస్ (సెప్టెంబరు 21)ఆహామారుతీనగర్ సుబ్రమణ్యం - తెలుగు సినిమాతిరగబడరా సామీ - తెలుగు మూవీకాఫీ - తమిళ సినిమాసాలా - తమిళ మూవీజియో సినిమాద పెంగ్విన్ - ఇంగ్లీష్ సిరీస్జో తేరా హై వో మేరా హై - హిందీ మూవీరుస్లాన్ - హిందీ సినిమామనోరమ మ్యాక్స్సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ - మలయాళ సినిమాఆనందపురం డైరీస్ - మలయాళ మూవీఆపిల్ ప్లస్ టీవీలా మైసన్ - ఫ్రెంచ్ సిరీస్సన్ నెక్స్ట్సత్యభామ - తెలుగు సినిమాబుక్ మై షోషోసనా - ఇంగ్లీష్ మూవీఎమ్ఎక్స్ ప్లేయర్ఇష్క్ ఇన్ ద ఎయిర్ - హిందీ సిరీస్(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?) -
ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్
ప్రస్తుతం అందరూ వినాయక చవితి నిమజ్జనం మూడ్‌లో ఉన్నారు. అలానే వచ్చే వారం 'దేవర' రిలీజ్ ఉంది కాబట్టి ఈ వారం చెప్పుకోదగ్గ మువీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'గొర్రె పురాణం', 'మన్యం ధీరుడు', 'హైడ్ అండ్ సీక్' అనే చిన్న చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ 16కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామీ చిత్రాలతో పాటు ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ హిందీ సిరీస్ పంచాయత్ తమిళ రీమేక్ 'తలైవేట్టాయామా పాళ్యం' ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఇవి కాకుండా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్/ వెబ్ సిరీస్ (సెప్టెంబరు 16 నుంచి 22 వరకు)హాట్స్టార్అన్ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16అగాథా: హౌస్ ఆఫ్ హార్క్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 18ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 20తలైవేట్టాయామాపాళ్యం (తమిళ సిరీస్) - సెప్టెంబరు 20ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21అమెజాన్ ప్రైమ్ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19నెట్ఫ్లిక్స్కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 17ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 19హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 20ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 21ఆహాహై ఆన్ కాదల్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 16తిరగబడరా సామీ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 19మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 20జియో సినిమాజో తేరా హై వో మేరా హై (హిందీ మూవీ) - సెప్టెంబరు 20ద పెంగ్విన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రావు రమేశ్ అంటే సహాయ పాత్రలు, విలన్ పాత్రలే గుర్తొస్తాయి. తనదైన యాక్టింగ్‌తో తెలుగులో ఓ మార్క్ సృష్టించాడు. ఇన్నాళ్లు ఇతడు సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ రీసెంట్గా హీరోగానూ మెప్పించాడు. ఈయన్ని ప్రధాన పాత్రధారిగా పెట్టి 'మారుతీనగర్ సుబ్రమణ్యం' అనే మూవీ తీశారు. గత నెలల్లో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)రావు రమేశ్ లీడ్ రోల్ చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు సెప్టెంబరు 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'మారుతీనగర్ సుబ్రమణ్యం' విషయానికొస్తే.. మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని పట్టుబట్టి ఖాళీగా ఉండిపోతాడు. ఊరి నిండా అప్పులు. ఇలా జీవితం సాగిస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో ఓ రోజు రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇవి వేసింది ఎవరు వేశారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)We got the laughter therapy you need!The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024 -
టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారంటూ ఆహా ట్వీట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. Madam, Sir twaralo #aha lo sandadi cheyyabotunnaru. Get ready to laugh out loud! 🤣 The hilarious #MaruthiNagarSubramanyam is coming soon to #aha! @lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/AWx0p6Bjuy— ahavideoin (@ahavideoIN) September 10, 2024 -
'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదుఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.ఎవరెలా చేశారు? రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
అల్లు అర్జున్‌తో కలిసి పని చేశా: అంకిత్ కొయ్య
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు.సినిమాల్లోకి వద్దన్నారుమాది విశాఖ. మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా అని చెప్తే సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా. అల్లు అర్జున్ మా అన్నయ్యఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. అల్లు ఫ్యామిలీకి, నాకు కనెక్షన్ ఉందేమోఈ మూవీ ట్రైలర్ చూసి అల్లు అరవింద్.. 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.