టాలీవుడ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ఏ ఓటీటీకి రానుందంటే? | Rao Ramesh Maruthi Nagar Subramanyam Coming On This Ott Paltform | Sakshi
Sakshi News home page

Maruthi Nagar Subramanyam: రావు రమేశ్‌ 'మారుతీనగర్‌ సుబ్రమణ్యం'.. ఓటీటీ ఫిక్స్‌!

Published Tue, Sep 10 2024 9:33 PM | Last Updated on Tue, Sep 10 2024 9:33 PM

Rao Ramesh Maruthi Nagar Subramanyam Coming On This Ott Paltform

రావు రమేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు.  పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్‌ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్‌ కార్య ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.

త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. మేడం, సర్‌ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారంటూ ఆహా ట్వీట్ చేసింది.  కాగా.. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్‌, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement