
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మజాకా' (Mazaka Movie) నుంచి బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.
(ఇదీ చదవండి: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ')
ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. నాగార్జునతో మన్మథుడులో నటించిన అన్షు (Anshu Ambani) చాలా కాలం తర్వాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ధనుంజయ్ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా ఉన్నారు.

'మజాకా' సినిమా కోసం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, జీ స్టూడియోస్ వారు కేవలం ఓటీటీ హక్కులను 20 కోట్లకు సొంతం చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే.. సందీప్ కిషన్ సినిమాకు భారీ డీల్ సెట్ అయినట్లే అని చెప్పవచ్చు. థియేటర్ రన్‌లో రూ. 10 కోట్లు రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment