► బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
► పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవం
వరంగల్: రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించని సీఎం కేసీఆర్‌కు మహిళలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని సీఎం వైఖరిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు.
సన్మానం... కార్యక్రమంలో భాగంగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, తక్కెళ్లపల్లి శ్రీదేవి, భవాని, సంగీతలను జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రూరల్, అర్బన్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు ముత్యాల శ్రీనివాస్, గురుమూర్తి శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త దశరథం, పార్లమెంటు కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, సదానందంగౌడ్, రామచంద్రారెడ్డి, గుండెమీది శ్రీనివాస్, చీర్ల కిరణ్‌రెడ్డి, మేకల రాజవీరు, తాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిర్ల కిరణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోల్తి రవికుమార్, పోతరాజు అశోక్, నరేష్, త్రిలోకేశ్వర్, ఠాగూర్ రవీందర్‌సింగ్, కక్కెర్ల శివ, టాక రాజు, మహేందర్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటి పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ రాష్ట్రానికి 90 వేల ఇళ్లు మంజూరు చేస్తే రెండింటిని ఒకటిగా చేసి డబుల్ బెడ్‌రూం అని చెప్పి 45 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారన్నారు.
కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. 2019 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ మెడికల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, యువమోర్చా జిల్లా కిరణ్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సయ్య, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రవి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.