తుగ్లక్‌లా సీఎం కేసీఆర్‌ | Tughlaq to Cm KCR | Sakshi
Sakshi News home page

తుగ్లక్‌లా సీఎం కేసీఆర్‌

Published Fri, Aug 19 2016 12:22 AM | Last Updated on Sat, Aug 25 2018 7:03 PM

Tughlaq to Cm KCR

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
  • హన్మకొండ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు.
    23 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఓ సారి.. 27 జిల్లాలని మరోసారి చెప్పడం... జిల్లా కేంద్రం, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామనడం ఔరంగజేబు రాజధానులను మార్చినట్లుగా ఉందని దుయ్యబట్టారు. జిల్లా చేయాలని కోరుతున్న జనగామను కాకుండా హన్మకొండను జిల్లా చేస్తామనడం, జిల్లా కేంద్రాన్ని ముక్కలు చేస్తామనడం సరికాదన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సెప్టెంబర్‌ 17న బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు ఎగుర వేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి, నాయకులు కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, చదుపట్ల కీర్తి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement