Tughlaq Dynasty
-
ఢిల్లీలో విషవాయువు కలకలం
-
ఢిల్లీలో విషవాయువు కలకలం
460 మంది విద్యార్థినులకు అస్వస్థత ► విష రసాయనం తీసుకెళ్తున్న కంటైనర్ లీకవడంతో ప్రమాదం ► అప్రమత్తమైన అధికారులు.. తప్పిన పెను ప్రమాదం న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్ నుంచి విష రసాయనం లీకవడంతో సమీపంలోని పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. చైనా నుంచి దిగుమతైన క్లోరోమిథైల్ పైరిడిన్ రసాయనాన్ని హరియాణాలోని సోనేపట్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా లీకై విషవాయువులు వ్యాపించాయి. దీంతో అక్కడికి సమీపంలో ఉన్న రాణి ఝాన్సీ స్కూలు, ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు కళ్ల మంటలు, కడుపునొప్పితో పాటు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకుని.. విద్యార్థినులను సమీపంలో ఉన్న నాలుగు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. కొన్ని గంటల చికిత్స తర్వాత అధికశాతం విద్యార్థినుల్ని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని మాత్రం రెండు ఆస్పత్రుల్లోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాత్రా ఆస్పత్రిలో దాదాపు 55 మంది విద్యార్థినులకు వైద్య సేవలందించామని, వారంతా సురక్షితంగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మజీతియా ఆస్పత్రిలో 107 మందికి చికిత్సనందించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే వైద్య సేవలందించేందుకు ఎయిమ్స్ డాక్టర్ల బృందం సిద్ధంగా ఉండా లని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. 80 క్యాన్ల క్లోరోమిథైల్ పైరిడిన్(పురుగుమందుల తయారీలో వాడతారు)తో కూడిన కంటైనర్ తుగ్లకాబాద్ డిపో నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు హరియాణాలోని సోనేపట్‌కు బయల్దేరింది. డిపో నుంచి బయటకు వచ్చాక టీ తాగేందుకు కంటైనర్‌ను సమీపంలోని రైల్వే కాలనీ వద్ద డ్రైవర్ ఆపాడు. ఈ సమయంలో కొంత రసాయనం లీకై రోడ్డుపై పడింది. అది గమనించని డ్రైవర్ సోనేపట్‌కు వెళ్లిపోయాడు. అయితే తుగ్లకాబాద్ ప్రాంతంలోని కస్టమ్స్ ఏరియాలో రసాయనం లీకై విషవాయువులు వ్యాపించాయంటూ ఉదయం 7.35 గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. సమీపంలో పలు స్కూళ్లు ఉండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగే జాతీయ విపత్తు నివారణ బృందాలు(ఎన్డీఆర్ఎఫ్), సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్(క్యాట్స్)కు చెందిన అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించాయి. గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం, అలాగే వెంటనే అప్రమత్తమై విద్యార్థుల్ని తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. -
తుగ్లక్ కాలంలోకి..
హ్యూమర్ ప్లస్ ఎవరో పనిలేనాయన ౖటñ ం మెషిన్ని కనిపెట్టాడు. ఇది తెలిసి నాకెంతో ఇష్టమైన తుగ్లక్ పాలనని చూడ్డానికి వెళ్లాను. తుగ్లకంటే నాకెందుకు ఇష్టమంటే ఆయన సర్వాంతర్యామి. అన్ని రాజ్యాల్లోనూ ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది.తుగ్లక్ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా కనిపించారు. కొంతమంది ‘తకిథినథోం’ అని డాన్స్ కూడా చేస్తున్నారు!‘‘మీ ఆనందానికి కారణమేంటి?’’... నాన్ స్టాప్‌గా స్టెప్పులు వేస్తున్న ఒకాయన్ని అడిగాను.‘‘తుగ్లక్ ప్రభువే’’ అన్నాడు డాన్స్ ఆపకుండా.‘‘ఆయన అంత బాగా పాలిస్తున్నాడా?’’‘‘పాలన, దండన ఇక్కడ రెండూ ఒకటే. ఆనందంగా కనబడకపోతే వంద కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.నేను భయంతో ‘హిహిహి’ అని ఇకిలించుకుంటూ ముందుకెళ్లాను. అక్కడ ఒకాయన ఒంటి కంటితో సూర్యుణ్ణి చూస్తున్నాడు.‘‘ఏం చేస్తున్నావ్’’ అని అడిగాను. ‘‘సూర్యుడిపై ఒక కన్నేసి ఉంచుతున్నాను. ఇక్కడి గూఢచారులు సూర్యచంద్రుల్ని కూడా వదలరు’’ అన్నాడు. ‘‘కళ్లు పోతాయి’’ అన్నాను. ‘‘ఇప్పటికి చాలామందికి పోయాయి. నేను కొత్తగా విధుల్లోకి వచ్చాను’’ అన్నాడు. ఇంకో చోటికి వెళితే ఒకాయన నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ పది మంది భటులు కాపలా ఉన్నారు. నన్ను చూసి, ‘‘నిద్రాభంగం కలిగించకు. ఆయన న్యాయాధికారి’’ అన్నాడో భటుడు.‘‘మీ దేశంలో న్యాయం ఇలా నిద్రపోతూ ఉంటుందా?’’‘‘మెలకువల వల్ల అనర్థాలు ఉన్నప్పుడు, నిద్రపోవడమే న్యాయం. ఆయన నిద్రలో కలలు కని, వాటి ఆధారంగా తీర్పులు చెబుతాడు’’.‘‘కలల్ని బట్టి తీర్పులు చెబుతాడా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘కలలతో తీర్పులేంటి, పాలనలే జరుగుతాయి. చాలాసార్లు కలలే పాలిస్తాయి. వ్యవస్థలు నిద్రపోతేనే వ్యక్తులకు న్యాయం జరిగేది’’.ఇంతలో న్యాయాధికారి గురక కూడా ప్రారంభించాడు. ఆ శబ్ధానికి నాలుగైదు గుర్రాలు బెదిరి పరుగులు తీశాయి. ఒక లేఖకుడు గురకని జాగ్రత్తగా వింటూ ఏదో రాసుకుంటూ ఉన్నాడు. గురకలో రాసుకోడానికి ఏముందో నాకర్థం కాలేదు. అదే అడిగాను.‘‘గురక గాఢతకు చిహ్నం. వినడానికి ఒకేలా ఉన్నా అందరూ ఒకేలా గురక పెట్టలేరు. శబ్ధం శబ్ధిస్తే దాన్ని గురక అంటారు. అర్థం కాకపోయినా శబ్ధానికి అర్థం ఉంటుంది. శబ్ధార్థాలు, అర్ధశబ్ధాలు జమిలి పదాలు’’ అన్నాడు. వాడు చెప్పిందాంట్లో అర్థం వెతకడం కంటే యూనివర్సిటీ థీసిస్ల్లో అర్థాలు వెతకడం ఈజీ.ఇంతలో ఒకాయన సైన్యంతో కవాతు చేస్తూ ఎదురొచ్చాడు. ‘‘ఎక్కడికి?’’ అని అడిగాను.‘‘యుద్ధానికి’’ కవాతు ఆపకుండా చెప్పాడు. ‘‘ఎవరి మీద?’’‘‘ఈ రాజ్యంలో ఎవరు ఎవరి మీదయినా యుద్ధం చేయవచ్చు. రాజు ప్రజలతో, ప్రజలు రాజుతో, ప్రజలు ప్రజలతో. యుద్ధం ఇక్కడ సర్వనామం. యుద్ధం తెలిసి చేస్తే అది ధర్మయుద్ధం. తెలియకుండా చేస్తే అది యుద్ధవ్యూహం అంటారు’’.నేను తికమకగా నడుస్తూ ఉంటే సాక్షాత్తూ తుగ్లక్ ప్రభువే ఎదురొచ్చాడు. ఆనందంగా దండం పెట్టాను. చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు.‘‘చూడ్డానికి ఇంత హూందాగా ఉన్నారే, మీకు పిచ్చి తుగ్లక్ అని పేరెందుకొచ్చింది?’’ అని అడిగాను.‘‘పిచ్చి వాళ్లను పాలించడం వల్ల’’ అన్నాడు. ‘‘అయితే మీకు పిచ్చి లేదా?’’‘‘పిచ్చిలో ఉన్న పిచ్చి గొప్పతనం ఏంటంటే, అది వున్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. ఇలా ప్రశ్నలు అడిగేవాళ్లను మా రాజ్యంలో యాభై కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.భటుడు కొరడా తీసేలోగా నేను టైం మిషన్‌లో పారిపోయి వచ్చాను.మన కాలంలోకి రాగానే ‘ట్రంపెట్’ మోగింది.మనం ఏ కాలంలో జన్మించినా ఆయా కాలాల్లో తుగ్లక్‌లు పుడుతూనే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒక తుగ్లక్‌ని మోస్తూనే ఉంటుంది. – జి.ఆర్.మహర్షి -
మోదీ చేస్తున్నది తుగ్లక్ పాలన: సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన విమర్శలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింత పదునెక్కించారు. 14వ శతాబ్దం నాటి ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్తో మోదీని ఆమె పోల్చారు. తాను కేంద్రంలో చాలా ప్రభుత్వాలు చూశానని, కానీ ఎప్పుడూ ఇలాంటి తుగ్లక్ ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. మోదీ వేర్వేరు సమయాల్లో వేర్వేరు మాటలు చెబుతుంటారని ఆమె చెప్పారు. తుగ్లక్ సర్కారు పాటిస్తున్న తుగ్లక్ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని బిర్భూమ్లో నిర్వహించిన వార్షిక 'జోయ్‌దేవ్ మేళా'లో మాట్లాడుతూ ఆమె అన్నారు. మోదీ బాబు ప్లాస్టిక్ కరెన్సీ సేల్స్‌మన్ అయిపోయారని, ప్లాస్టిక్‌ను ఎవరు తింటారని ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద డబ్బులు లేవని, ప్రజల డబ్బంతటినీ నల్లధనంగా ప్రకటించి, బీజేపీ డబ్బును మాత్రం తెల్లడబ్బు అంటున్నారని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లను అవినీతిపరులన్నారని, కేంద్ర సంస్థలను వాళ్ల మీదకు పంపారని మమత తెలిపారు. సీబీఐ అంటే 'కాన్స్పిరసీ బ్యూరో ఆఫ్ ఇండియా' అని ఆమె అభివర్ణించారు. గుజరాత్లో జరిగిన అల్లర్ల కారణంగా అమెరికా మోదీని గతంలో బ్లాక్‌లిస్ట్ చేసిందని, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన తీరు మార్చుకోకుండా.. కుట్రలు పన్నుతూనే ఉన్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలంతా బయటికొచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. -
‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐది కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐది కానే కాదని అన్నారు. అది ఒకే ఒక్క వ్యక్తి తీసుకొచ్చిన తుగ్లక్ ఫర్మానా అంటూ ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ ఇచ్చిందని, అందులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమేనని చెప్పిందని, ప్రభుత్వం ఏం చెబితే అదే చేయాలని తమను ఆదేశించినట్లు ఆర్బీఐ అందులో పేర్కొందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందునుంచే వామపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
తుగ్లక్‌ను గుర్తుకుతెచ్చిన మోదీ నిర్ణయం
వరంగల్ : దేశంలో రైతులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చూస్తుంటే పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రీజినల్ కోఆర్డినేటర్ పీసీ.విష్ణునాథ్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పెద్ద నోట్ల రద్దుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో, విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని మోదీ ప్రకటించారన్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, అనంతరం ఉంటే తనను ఉరితీయాలని మోదీ ప్రకటన చేశారని, ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నందున ఏం చేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. నోట్ల రద్దు వల్ల పాత రూ.500, రూ.1000 నోట్లు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పాలని పీఎం మోదీని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయంపై ఆర్బీఐని ప్రశ్నించినా వారి వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారమూ రావడం లేదని విష్ణునాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. పీఎం మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి నష్టం జరుగుతున్న విషయాలను గుర్తించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు తప్పుడు నిర్ణయం అని బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో ఆస్తులను కొనుగోలు చేశాయన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బీహార్‌లో 8, ఒడిషాలో 14 ఆస్తులను రూ.3.41కోట్లకు కొనుగోళ్లు చేసిన విషయాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేసిందన్నా రు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ ఏకపక్షంగా తీసుకోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. దేశంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకునే ముందు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి తీసుకుంటారని, అలా కాకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుండెబోయిన విజయరామారావు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరెపల్లి మోహన్, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, ఆరోగ్యం, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ నాయకులు కట్ల శ్రీనివాస్‌రావు, రాజనాల శ్రీహరి, టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్తుండగా పోలీ సులు అడ్డుకొని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
మోదీపై సీతారాం ఏచూరి సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు. మోదీ ఓ తుగ్లక్ అని, ఆదేశాలు జారీ చేసి కనిపించకుండా పోయారని వ్యాఖ్యానించాడు. పెద్ద నోట్ల రద్దు విషయంలో అంతకుముందు రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన శుక్రవారం కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మెట్రో నగరాల్లో ఇప్పటికే 20 నుంచి 25శాతం డబ్బుకు డిమాండ్ పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కానీ తుగ్లక్(ప్రధాని మోదీ) మాత్రం ఆదేశాలు ఇచ్చి కనిపించకుండా పోయారు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. రూ.500 నోట్లు భిన్నవిధాలుగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గురించి ఆయనను ప్రశ్నించగా అందుకు కూడా ప్రధానిని విమర్శించారు. దొంగ నోట్లను అరికట్టేందుకు ప్రధాని అనుసరిస్తున్న మోదీ విధానం ఇలాగే ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
పిచ్చి తుగ్లక్కు ప్రతిరూపం సీఎం కేసీఆర్
♦ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ధ్వజం ♦ సోయిలేకుండా ఫాంహౌస్‌లో ఉంటున్నదెవరు? ♦ సిగ్గూ, శరంలేకుండా అబద్ధాలు... మాయమాటలు ♦ రుణమాఫీ చేయనందుకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారా? సాక్షి, హైదరాబాద్: పిచ్చి తుగ్లక్‌ను చూడలేదనే అవసరం లేకుండా, తుగ్లక్ ప్రతిరూపంగా ప్రజలు సీఎం కేసీఆర్‌ను చూసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, ఎం.కోదండరెడ్డితో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎంగా సామా న్య ప్రజలకే కాకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలనే సోయిలేకుం డా ఫాంహౌస్‌లో ఉంటున్నదెవరని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులు, విద్యార్థుల సమస్యల గురించి అడిగితే పరిష్కరించాల్సింది పోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు తగదని హెచ్చరించారు. ‘ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అబ ద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి రావడంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కినయి. రైతులకు రుణమాఫీ చేయాలంటే తప్పా? విద్యార్థులకు ఫీజులను రీయింబర్స్ చేయాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టీగా సోయితోనే అడిగినం. జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు అడిగినం. 5 లక్షల మందితో ఒక జిల్లా, 50 లక్షల మందితో మరో జిల్లానా..? పరిపాలనా సౌలభ్యం అందరికీ ఒకేరకంగా ఉండొద్దా? వీటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌పార్టీని, వ్యక్తిగతంగా నన్ను సంస్కారం లేకుండా కేసీఆర్ హేళనగా మాట్లాడటం మంచిదికాదు. దేశ చరిత్రలోనే ఇలాంటి సంస్కారం, సంస్కృ తి తెలియని ముఖ్యమంత్రి ఉండరు. ఇకపై సీఎం కేసీఆర్‌కు మర్యాద ఇచ్చేది లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌కు ఇంగితజ్ఞానం ఉంటే రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. నిర్లజ్జగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ప్రతిపక్షాలను హేళన చేయడం మానుకోవాలని సూచించారు. పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకేనా? రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్లలో పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే అప్పగించారని ఉత్తమ్ ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు, తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు దక్కినాయో లెక్కలతో సహా రెండ్రోజుల్లో బయటపెడ్తామని ఉత్తమ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వ్యకిగత విషయాలను మాట్లాడదలచుకోలేదన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే సోయితోనే కరువు, వరదలతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడానికి గ్రామాల్లోకి వెళుతున్నామన్నారు. రైతులపై అబద్ధాలు.. రైతుల సమస్యలనుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కరువులో ప్రభుత్వం ఆదుకోనందుకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారా?, వరదల్లో చేతికొచ్చిన పంట నష్టపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నారా?, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయనందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. 40 లక్షల మంది రైతులతో రుణమాఫీ కోసం, ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ విద్యార్థులతో నెలరోజులపాటు దరఖాస్తులను చేయించనున్నట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. గ్రామాల్లోకి పోదాం.. దమ్ముంటే రా.. సీఎం కేసీఆర్‌కు భట్టి సవాల్ రైతులు పడుతున్న ఇబ్బందులు, వరదల్లో నష్టపోయిన పంటపొలాలను చూసే దమ్ముంటే సీఎం కేసీఆర్ గ్రామాల్లోకి రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సవాల్ చేశారు. ఖమ్మం జిల్లాలో పాడైపోయిన పత్తి పంట, నకిలీ విత్తనాలతో కాతలేని మిర్చి పంటలను భట్టి మీడియాకు చూపించారు. కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సిరెడ్డి టేకుమట్లలో నిరాహార దీక్షల విరమణ చిట్యాల : రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో 24రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన అవినీతితో సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను, కార్మికులను, కర్షకులను, జర్నలిస్టులను అణచివేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా టేకుమట్ల మండలాన్ని శాస్త్రీయంగా చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, బతుకమ్మ కార్యక్రమాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. వరద తాకిడితో ప్రజలు ఆందోళన చెందుతుంటే సీఎం, మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని, ఒక అన్నం పొట్లం కూడా బాధితులకు అందజేయలేదని ధ్వజమెత్తారు. స్పీకర్ బెదిరింపులకు భయపడం భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్, తన తనయులతో టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం మానుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుంటే పోలీసులతో, రెవెన్యూ అధికారులతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నా రు. అవినీతి కుబేరులు ఎవరనేది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. టేకుమట్ల వంతెన నిర్మాణం ఎందుకు నిలిచిందో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్ ఇచ్చిన హామీతో దీక్షలను విరమింపజేస్తున్నామని, మండలం ప్రకటించకపోతే అక్టోబర్ 3 తర్వాత మళ్లీ ఉద్యమిస్తామన్నారు. -
తెలంగాణలో తుగ్లక్ పాలన
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు జనగామ : తెలంగాణలో తుగ్లక్ పరిపాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఆరోపించారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణకు బాటలు వేస్తారని ఆశించిన ప్రజలకుæటీఆర్ఎస్ ప్రభుత్వం హైఓలే్టజీ షాక్ ఇస్తుందని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఒం టెద్దు పోకడలతో ఏర్పాటు కానున్న జిల్లాల విషయంలో అధికార పార్టీ నేతలు సైతం విస్మయానికి గురవుతున్నారని తెలిపారు. జనగామ జిల్లా చేయాలని మెజార్టీ మండలా లు కోరుతూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్ హన్మకొండను తెరపైకి తీసుకురావడం హాస్యాస్పదమన్నారు. జనగామ జిల్లా చేసేందుకు పది మండలాలు సిద్ధంగా ఉన్నాయని, మరో రెండు కలుపుకుని జిల్లాగా ప్రకటించాలని సీఎంను కోరారు. నెల్లుట్ల నర్సింహారావు, శ్రీనివాస్, జగదీష్, సత్యం, రమేష్, వెంకట్ పాల్గొన్నారు. -
తుగ్లక్‌లా సీఎం కేసీఆర్
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హన్మకొండ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. 23 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఓ సారి.. 27 జిల్లాలని మరోసారి చెప్పడం... జిల్లా కేంద్రం, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామనడం ఔరంగజేబు రాజధానులను మార్చినట్లుగా ఉందని దుయ్యబట్టారు. జిల్లా చేయాలని కోరుతున్న జనగామను కాకుండా హన్మకొండను జిల్లా చేస్తామనడం, జిల్లా కేంద్రాన్ని ముక్కలు చేస్తామనడం సరికాదన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు ఎగుర వేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి, నాయకులు కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, చదుపట్ల కీర్తి పాల్గొన్నారు. -
తెలంగాణలో తుగ్లక్ పాలన
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ సభలో ప్రజాసమస్యలను లేవనెత్తుతారన్న అభద్రతాభావంతో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని అరెస్టులు చేసిన హీనమైన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజాసమస్యలను ఎత్తిచూపేవారిని తీవ్రవాదులవలే పరిగణనలోకి తీసుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సారా బ్రాందీ అమ్మకాలతో ఆదాయం పెంచుకుని పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమంతోనే గద్దెనెక్కిన కేసీఆర్ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రజలను అణగదొక్కుతున్నాడని పేర్కొన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్లుమార్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నా ఆ పార్టీ నాయకులు దద్దమ్మలవలే చూస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చల్లా ప్రగతిరెడ్డి, వైస్ ఎంపీపీ కడారి సదానందం, పార్టీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ పాల్గొన్నారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పరిపాలన
► కార్పొరేట్ విద్యను దూరం చేస్తామని చెప్పారు. ► కేజీ టూ పీజీ విద్య ఏమైంది? ► వారం రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం ► ఆగస్టు మొదటి వారంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం ► టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి వికారాబాద్ రూరల్ : రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్కా మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. విద్యారంగ సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తానని, లక్ష ఉద్యోగులు సంవత్సరానికి ఇస్తామని మరిచిపోయారన్నారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తామని, కల్లబొల్లి మాటలు చెప్పరని విమర్శించారు. విద్యార్థులను బిచ్చగాళ్లలా చూస్తున్నారని, వారికి రావాల్సిన డబ్బులను విడతల వారీగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులను మరిచిపోయి.. సమైక్యవాదం తెలిపిన వారిని మంత్రి పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యను దూరం చేసి కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెడతానని చెప్పి.. ఎర్రవల్లి గ్రామం, ఫౌంహౌస్‌కే పరిమితమయ్యారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. లక్ష్య ఉద్యోగాలు అన్నారు..ఽ కేజీటూ పీజీ అన్నారు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్నారు.. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్పీ.. అంటూ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించాలని, వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ముసుగులో కూరుకుపోయిందని, అధికారులు అవినీతికి దూరంగా ఉండాలన్నారు. ఎప్పుడు చూసినా మిషన్ కమిషన్ కాకతీయ, భగీరథ అంటున్న శ్రద్ధ చూపుతున్న సీఎం.. విద్యారంగ సమస్యలపై ఎందుకు చూపడం లేదన్నారు. డిగ్రీ కళాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబోయే వికారాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో 50 వేల మంది విద్యార్థులతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రంగరాజ్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉమాశేఖర్, జిల్లా కార్యదర్శి గొడుగు పాండు, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానిది తుగ్లక్ పాలన
బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ క్రైం : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన తుగ్లక్ పాలనను మించిపోతోందని బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, ఆర్థిక వనరులు భాగున్నాయని చెబుతున్న కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతుల రుణమాఫీ చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ విడుదల చేయలేదన్నారు. జిల్లాలో రూ. 3,489 రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. పత్తిసాగు చేసుకోవద్దని చెబుతున్న ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇన్సూరెన్స్ అవకాశం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బాధల్లో ఉన్న రైతులను ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు చెలామని అవుతున్న ప్రభుత్వం వాటిపై నియంత్రించడంలో విఫలమైందన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని, గ్రామాల్లో మంత్రులు పర్యటించకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు మడావిరాజు, వేణుగోపాల్, జోగురవి, రాము, మోహన్‌లు ఉన్నారు. -
బాబు విజన్ ఉన్న సీఎం
నాయుడుపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి తుగ్లక్కాదని, విజన్ కలిగిన ముఖ్యమంత్రి అని మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు బాబుది తుగ్లక్ పాలన అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసుంటే ముస్లింలు, క్రైస్తవులు తమ పార్టీకి దూరమయ్యే వారు కాదన్నారు. హామీలను నెరవేర్చేందుకు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కృష్ణయ్య, సుబ్రమణ్యం, నెలవల రవి, కన్నయ్య పాల్గొన్నారు. -
సీఎంకు తుగ్లక్ కాలం నాటి నాణెం బహూకరణ
సాక్షి, హైదరాబాద్: గియాజుద్దీన్ తుగ్లక్ కాలం నాటి అరుదైన బంగారు నాణేన్ని టీఆర్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహూకరించారు. శనివారం అసెంబ్లీలో సీఎంను కలసిన ఆయన తెలంగాణను సాధించి నందుకుగాను ఈ నాణెం బహూకరించినట్లు తెలిపారు. దేవేందర్‌కు పురాతన నాణేలు, వస్తువులు సేకరించే అలవాటు ఉంది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఆక్రమించిన గియాజుద్దీన్ తుగ్లక్ కొడుకు అప్పటి యువరాజు మహ్మద్ బీన్ తుగ్లక్ ఆధ్వర్యంలో వరంగల్‌లో మల్కీ తిలాంగ్ మింట్ ఏర్పాటైంది. సీఎంకు అందించిన నాణెం ఇందులో తయారైనదే. దానిపై మల్కీ తిలాంగ్ మింట్ (లాండ్ ఆఫ్ తెలుగు) అని ముద్రితమై ఉంది. అరుదైన నాణేన్ని బహూకరించినందుకు ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేకరించిన ఇతర నాణేల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్‌కు బహుమతిగా అరుదైన నాణెం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు టీఆర్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు అరుదైన నాణేన్ని బహూకరించారు. శనివారం అసెంబ్లీలో సీఎంను కలిసిన ఆయన గియాసుద్దీన్ తుగ్లక్ కాలంనాటి నాణేన్ని అందజేశారు. స్వతహాగా దేవేందర్‌రావు నాణేలను సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రికి బహూకరించిన నాణెం... కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి ఆక్రమించిన యువరాజు మహ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్‌లో ముల్కీ తిలాంగ్ పేరిట మింట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. కాకతీయ సామ్రాజ్యంపై విజయ సూచికగా అప్పట్లో తన తండ్రి గియాసుద్దీన్ పేరిట నాణేన్ని ముద్రించారు. అప్పటి నాణేన్నే దేవేందర్‌రావు ముఖ్యమంత్రికి అందజేశారు. అంతటి అరుదైన నాణేన్ని బహూకరించిన ఆయనకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది
► మాటలకు పనులకు పొంతన లేదు ► ప్రజాసమస్యలపై నిలదీయండి ► పార్టీ వర్క్ షాప్‌లో రేవూరి పిలుపు వరంగల్ : చెప్పే మాటలకు చేసే పనులకు పొం తన లేకుండా రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, ప్రజాసమస్యలపై అధికారులను, మంత్రులను నిలదీయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన మండల, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీడీపీపై తప్పు డు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ పా లనపై లేదన్నారు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా డబుల్ బెడ్రూం, కేజీ టూ పీజీ, మూడెకరాల భూమి పథకాలు ఏమాయ్యాయన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం టీడీపేనన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు మండల నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీతక్క మాట్లాడుతూ స్వార్థ పరులు పార్టీని వీడినా.. టీఆర్ఎస్ నాయకులు ఎంత దుష్ర్పచారం చేసినా రానున్న రోజుల్లో టీడీపీకే ప్రజలు బ్రహ్మరథం పడ తారని అన్నా రు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, నాయకులు పుల్లూరు అశోక్‌కుమార్, బాలూ చౌహాన్, బొట్ల శ్రీనివాస్, గట్టు ప్రసాద్‌బాబు, దొనికెల మల్లయ్య, జాటోత్ ఇందిర,తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చి తుగ్లక్‌లా చంద్రబాబు పాలన
చంద్రబాబు పరిపాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యముంటే నీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని అన్నారు. నీటి సంఘం ఎన్నికల్లో 75 శాతం టీడీపీపై వ్యతిరేకత రాకపోతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆయన సవాలు చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలపై రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టిసీమ పంపులు ఎక్కడున్నాయో తెలియకుండానే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గండేపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో శవ రాజకీయాలు చేసింది ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడేనని జ్యోతుల ఆరోపించారు. పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబు కారణమనే అక్కడి మృతులకు రూ. 10 లక్షల వంతున పరిహారం ఇచ్చారన్నారు. -
తుగ్లక్ పాలనను మరిపిస్తున్న కేసీఆర్
కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను మరిపిస్తుందని, అనాలోచిత నిర్ణయాలతో వివాదస్పద మాటలతో కేసీఆర్ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద బుధవారం రాజీవ్ రహదారి దిగ్భందం, వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసిందని, భూసేకరణ పూర్తయిందని, నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇంతలోనే రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం యోచించడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ హయూంలో చేపట్టిన ప్రాజెక్టులను వివాదస్పదం చేస్తూ సీఎం కేసీఆర్ రోజుకో మాటమాట్లాడటం తగదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసే యోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రిజర్వాయర్ పరిధిలోని ప్రజలకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు సహాయ చర్యలకు చేపట్టకుండా... కేంద్రానికి నివేదిక అందించకుండా రైతులను దగా చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ హయూంలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలను పరామర్శించాలనే సోయి లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని భావించిన ప్రజల ఆశలు అడియాశలు ఆయ్యాయని, యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. తోటపల్లితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సొంతూరు పేరుతో నిర్మిస్తున్న తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేస్తుంటే ఆయన సిగ్గుపడాలన్నారు. రాజీవ్హ్రదారి దిగ్బంధం అంతం కాదని, ఆరంభమేనని అన్నారు. కేసీఆర్‌కు జేజేలు కొట్టిన జిల్లా ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద మాట్లాడుతూ... తలాతోక లేని విధానాలతో ప్రజలను మభ్యపెట్టడం కేసీఆర్‌కు నిత్యకృత్యంగా మారిందని అన్నారు. జిల్లా మంత్రులు కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించకపోతే రానున్న రోజుల్లో ముప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, బొమ్మ వెంకన్న, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కొమొరెడ్డి రాములు, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బాబా సలీంపాషా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, తోటపల్లి భూనిర్వాసితుల పోరాట సమితి కన్వీనర్ సిహెచ్.జనార్దన్‌రెడ్డి, తోటపల్లి రిజర్వాయర్ సాధన సమితి కన్వీనర్ కెడం లింగమూర్తితో పాటు రెండు వేల మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఉత్తమ్ సహా నాయకుల అరెస్టు రాజీవ్ రహదారి దిగ్బంధం, వంటవార్పు తరువాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మధ్యాహ్నం 3.50 గంటలకు పోలీసులు వలయంగా ఏర్పడి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నేరెళ్ల శారదతో పాటు మాజీ ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
చో రామస్వామికి అస్వస్థత
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు, తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి(80) ఆస్పత్రిపాలయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను బుధవారం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ధియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు. 'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణకు ఆయన స్వయాన మేనమామ. -
తుగ్లక్ ను తలపిస్తున్న కేసీఆర్: ఎర్రబెల్లి
హైదరాబాద్: కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని తెలంగాణ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలంతా కష్టాలు పడుతుంటే సీఎం విహారయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు మాని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైందన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు మరోసారి వాయిదా వేయకుండా గడువు ప్రకారం నిర్వహించాలని ఎర్రబెల్లి సూచించారు. -
ఫిడేలు వాయిస్తున్న కేసీఆర్: పొన్నం
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్‌ను తలపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై పొన్నం ప్రభాకర్ గురువారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగు నెలలు గడిచిన రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మునుపెన్నడు లేని విధంగా ఉన్నాయని అన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఓ వైపు కేసీఆర్ ఫిడేలు వాయిస్తున్నారని విమర్శించారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను మాయమాటలతో గారడీ చేస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది. 19న ఒక్కరోజే సర్వే చేసి ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తానని చెప్పడమే దీని కి నిదర్శనమని ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఆయన టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక సర్వేను వారం రోజులు నిర్వహిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులకు విద్యుత్ ఇవ్వకుండా లాఠీచార్జ్‌లు చేయిస్తూ, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించకుండా రోడ్డు మీద పడేస్తూ సాగిస్తున్న పాలనపై ప్రజలతో కలిసి తిరగబడతామన్నారు. రమణ మాట్లాడుతూ కేసీఆర్ రెండు నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన
నాగర్‌కర్నూల్: తెలంగాణలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన తలపిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆయన పిచ్చిచేష్టల కారణంగా హైదరాబాద్ అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ దుస్తులు, వాహనాల కొనుగోలుపై చూపుతున్న శ్రద్ధ రైతులపై చూపడం లేదని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి నిమిషం కూడా కోత లేకుండా సరఫరా చేస్తుంటే కేసీఆర్ ఇంకా మూడేళ్ల వరకు కరెంట్ కష్టాలు ఉంటాయనడం విడ్డూరమన్నారు. విద్యార్థులు, రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు