బాబు విజన్ ఉన్న సీఎం
నాయుడుపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి తుగ్లక్‌కాదని, విజన్ కలిగిన ముఖ్యమంత్రి అని మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు బాబుది తుగ్లక్ పాలన అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసుంటే ముస్లింలు, క్రైస్తవులు తమ పార్టీకి దూరమయ్యే వారు కాదన్నారు. హామీలను నెరవేర్చేందుకు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కృష్ణయ్య, సుబ్రమణ్యం, నెలవల రవి, కన్నయ్య పాల్గొన్నారు.