![BJP MLC Madhav Demand For Investigate On IT Grids Scam - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/6/madav.jpg.webp?itok=kF0QmwGQ)
సాక్షి విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ మాత్రం జరగలేదుగానీ ఓట్లమాఫీ మాత్రం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీకి కేవలం ఐదులక్షల ఓట్లు మాత్రం తేడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీగ్రిడ్స్ స్కాం కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఏమీ తప్పుచేయని చంద్రబాబు గుమ్మడికాయ దొంగాల భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవోను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని మాధవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వివేకం కోల్పోయి.. దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని హితవుపలికారు. ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రజల డేటాను ఎవరికిచ్చిందో విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment