- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నర్సిరెడ్డి
- టేకుమట్లలో నిరాహార దీక్షల విరమణ
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
Published Mon, Sep 26 2016 12:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:03 PM
చిట్యాల : రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో 24రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన అవినీతితో సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను, కార్మికులను, కర్షకులను, జర్నలిస్టులను అణచివేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా టేకుమట్ల మండలాన్ని శాస్త్రీయంగా చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, బతుకమ్మ కార్యక్రమాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. వరద తాకిడితో ప్రజలు ఆందోళన చెందుతుంటే సీఎం, మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని, ఒక అన్నం పొట్లం కూడా బాధితులకు అందజేయలేదని ధ్వజమెత్తారు.
స్పీకర్ బెదిరింపులకు భయపడం
భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్, తన తనయులతో టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం మానుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుంటే పోలీసులతో, రెవెన్యూ అధికారులతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నా రు. అవినీతి కుబేరులు ఎవరనేది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. టేకుమట్ల వంతెన నిర్మాణం ఎందుకు నిలిచిందో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్ ఇచ్చిన హామీతో దీక్షలను విరమింపజేస్తున్నామని, మండలం ప్రకటించకపోతే అక్టోబర్ 3 తర్వాత మళ్లీ ఉద్యమిస్తామన్నారు.
Advertisement
Advertisement