పిచ్చి తుగ్లక్లా చంద్రబాబు పాలన | chandra babu naidu's governance resembles that of tuglak, says jyothula nehru | Sakshi
Sakshi News home page

పిచ్చి తుగ్లక్లా చంద్రబాబు పాలన

Published Tue, Sep 15 2015 6:56 PM | Last Updated on Sat, Aug 25 2018 7:03 PM

పిచ్చి తుగ్లక్లా చంద్రబాబు పాలన - Sakshi

పిచ్చి తుగ్లక్లా చంద్రబాబు పాలన

చంద్రబాబు పరిపాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యముంటే నీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని అన్నారు. నీటి సంఘం ఎన్నికల్లో 75 శాతం టీడీపీపై వ్యతిరేకత రాకపోతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఆయన సవాలు చేశారు.

సాగునీటి సంఘాల ఎన్నికలపై రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టిసీమ పంపులు ఎక్కడున్నాయో తెలియకుండానే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గండేపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో శవ రాజకీయాలు చేసింది ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడేనని జ్యోతుల ఆరోపించారు. పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబు కారణమనే అక్కడి మృతులకు రూ. 10 లక్షల వంతున పరిహారం ఇచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement