‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐది కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్‌బీఐది కానే కాదని అన్నారు. అది ఒకే ఒక్క వ్యక్తి తీసుకొచ్చిన తుగ్లక్ ఫర్మానా అంటూ ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు.
పార్లమెంటరీ కమిటీకి ఆర్‌బీఐ వివరణ ఇచ్చిందని, అందులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమేనని చెప్పిందని, ప్రభుత్వం ఏం చెబితే అదే చేయాలని తమను ఆదేశించినట్లు ఆర్‌బీఐ అందులో పేర్కొందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందునుంచే వామపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.