దేశంలో ఇప్పటివరకూ చలామణిలో రూ.2 వేల నోటు శకం ముగిసింది. రూ.2 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా చలామణి నుంచి ఉపసంహరించింది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది.
ఆరేళ్ల ప్రస్థానం
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా 2016 నవంబర్ 8న ఆర్బీఐ ఈ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్‌తో విడుదల చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ.
ఆకర్షణీయ డిజైన్
రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్‌యాన్ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది.
మైసూరులో ప్రింటింగ్
రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2017 మార్చి ఆఖరు నాటికి 3,285 మిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది వీటి సంఖ్య కేవలం 3,365. అప్పటి నుంచి ముద్రణను క్రమంగా తగ్గించేసింది ఆర్బీఐ. 2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.18,037 కోట్లు. 2020 మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న అన్ని నోట్లలో రూ.20 వేల నోట్లు కేవలం 22.6 శాతం.
ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్‌బీఐ గురి.. పరిమితికి మించితే అనుమతి తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment