రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది
► మాటలకు పనులకు పొంతన లేదు
► ప్రజాసమస్యలపై నిలదీయండి
► పార్టీ వర్క్ షాప్‌లో రేవూరి పిలుపు
వరంగల్ : చెప్పే మాటలకు చేసే పనులకు పొం తన లేకుండా రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, ప్రజాసమస్యలపై అధికారులను, మంత్రులను నిలదీయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన మండల, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీడీపీపై తప్పు డు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ పా లనపై లేదన్నారు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా డబుల్ బెడ్‌రూం, కేజీ టూ పీజీ, మూడెకరాల భూమి పథకాలు ఏమాయ్యాయన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం టీడీపేనన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు మండల నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీతక్క మాట్లాడుతూ స్వార్థ పరులు పార్టీని వీడినా.. టీఆర్‌ఎస్ నాయకులు ఎంత దుష్ర్పచారం చేసినా రానున్న రోజుల్లో టీడీపీకే ప్రజలు బ్రహ్మరథం పడ తారని అన్నా రు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, నాయకులు పుల్లూరు అశోక్‌కుమార్, బాలూ చౌహాన్, బొట్ల శ్రీనివాస్, గట్టు ప్రసాద్‌బాబు, దొనికెల మల్లయ్య, జాటోత్ ఇందిర,తదితరులు పాల్గొన్నారు.