REVURI prakashreddy
-
‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌కు గురువారం టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్ఎస్ నేతలు గట్టు రాంచంద్రారావు, ఉపేందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే హరీశ్ సీఎం అవుతారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి కల్పించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌రావు తనకు ఫోన్ చేసినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని తప్పుబట్టారు. నర్సాపూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సీఎం పదవిని గౌరవించకుండా మీడియాలో ప్రచురించలేని బూతులు మాట్లాడారని ఆరోపించారు. -
ఆత్మహత్యల్లో రెండోస్థానం.. అవినీతిలో ఫస్ట్ ర్యాంక్!
► కమీషన్ కాకతీయగా మార్చారు ► టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి పరకాల: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లోనే కొడుకు, కూతురు, అల్లుడుతో కలిసి అవినీతి పునాదులు వేస్తున్నారని, మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని దామెర చెరువు, ధర్మారంలోని మారేడు చెరువును బుధవారం ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుసరి అనసూయ(సీతక్క), వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు తాము వ్యతిరేకం కాదని, చెరువుల పూడికతీత పనులలో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ టెండర్లలో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెడితే నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండగా, అవినీతిలో మాత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించిందన్నారు. టీఆర్ఎస్ నాయకులకే కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించిన కోదండరాంను విషపునాగు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది
► మాటలకు పనులకు పొంతన లేదు ► ప్రజాసమస్యలపై నిలదీయండి ► పార్టీ వర్క్ షాప్‌లో రేవూరి పిలుపు వరంగల్ : చెప్పే మాటలకు చేసే పనులకు పొం తన లేకుండా రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, ప్రజాసమస్యలపై అధికారులను, మంత్రులను నిలదీయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన మండల, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీడీపీపై తప్పు డు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ పా లనపై లేదన్నారు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా డబుల్ బెడ్రూం, కేజీ టూ పీజీ, మూడెకరాల భూమి పథకాలు ఏమాయ్యాయన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం టీడీపేనన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామ, మండలస్థాయిలో పార్టీని బలోపేతం చేసేం దుకు మండల నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీతక్క మాట్లాడుతూ స్వార్థ పరులు పార్టీని వీడినా.. టీఆర్ఎస్ నాయకులు ఎంత దుష్ర్పచారం చేసినా రానున్న రోజుల్లో టీడీపీకే ప్రజలు బ్రహ్మరథం పడ తారని అన్నా రు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, నాయకులు పుల్లూరు అశోక్‌కుమార్, బాలూ చౌహాన్, బొట్ల శ్రీనివాస్, గట్టు ప్రసాద్‌బాబు, దొనికెల మల్లయ్య, జాటోత్ ఇందిర,తదితరులు పాల్గొన్నారు.