ఫిడేలు వాయిస్తున్న కేసీఆర్: పొన్నం
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్ను తలపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై పొన్నం ప్రభాకర్ గురువారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగు నెలలు గడిచిన రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మునుపెన్నడు లేని విధంగా ఉన్నాయని అన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఓ వైపు కేసీఆర్ ఫిడేలు వాయిస్తున్నారని విమర్శించారు.