
'టీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి'
కరీంనగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. సామాజికన్యాయం గురించి గొప్పగా చెప్పే కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్కు సూచించారు. పాఠశాలలకు సన్నబియ్యం ఇవ్వడం సామాజిక బాధ్యత అని ఆయన కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలని కేసీఆర్ను కోరారు.