కేసీఆర్పై నిప్పులు చెరిగిన పొన్నం
హైదరాబాద్: రాష్ట్రంలోని దళితుల పట్ల సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని గతంలో దళితులకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు 225 మందికి మాత్రమే భూములిచ్చారని పొన్నం ఆరోపించారు. అలాగే దళితులకు కేటాయించిన రూ. 180 కోట్లలో కేవలం 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.
కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే తెలంగాణలోని 3 లక్షల మంది దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి 90 ఏళ్ల పడుతుందన్నారు. దళితులకు సీఎం పదవి మాదిరిగానే భూ పంపిణీ అనేది కూడా మాటలకే పరిమితమయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ఈ సందర్బంగా కేసీఆర్ను డిమాండ్ చేశారు.