మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా | will not leave ysrcp at any cost, says balineni srinivasa reddy | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా

Published Tue, Apr 19 2016 2:29 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా - Sakshi

మంత్రి పదవి వదులుకుని మరీ వచ్చా

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రిపదవిని కూడా వదులుకుని వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు. తాను అసలు టీడీపీ నేతలతోనే మాట్లాడనప్పుడు.. వాళ్లకు ఆ పార్టీలోకి వస్తానని హామీలు ఎవరిచ్చారో తెలియదని చెప్పారు.

ఇక తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. తామంతా శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement