చంద్రబాబు రెండు సంతకాల వెనుక...
గుంటూరు: పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడిదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. స్వయంగా తనకు అనుభవమైన సంఘటనను ప్లీనరీ వేదికగా నాయకులు, కార్యకర్తలకు తెలియజేశారు. 1999 తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఓ పేదవాడి వైద్యం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చంద్రబాబును కలవడం జరిగిందన్నారు. రిలీఫ్ ఫండ్ కోసం సంతకం పెట్టారని కానీ, ఆ పేదవాడు తన ఇల్లు తాకట్టుపెట్టి ఆపరేషన్ చేయించుకున్నాడన్నారు. బాబు సంతకం పెట్టారని సీఎం రిలీఫ్ ఫండ్ కార్యాలయానికి వెళితే.. ఇచ్చే దానికి ఒక సంతకం.. ఇవ్వని దానికి ఒక సంతకం మార్చి పెడతారని అధికారులు చెప్పారని గుర్తు చేశారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా పేదవాడి వైద్యం కోసం నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అలాంటి పులికి పులిబిడ్డగా వైఎస్ జగన్ మనందరి ముందుకు వచ్చారన్నారు. వెన్నుపోటు వ్యక్తిత్వం ఉన్న చంద్రబాబుకు పప్పు పుట్టాడని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎంపికైన లోకేష్‌ను పప్పు అనక మరేమనాలన్నారు.
ప్రకాశం జిల్లా తీర్మానాలు ...
1. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో వెలుగొండ ప్రాజెక్టు కోసం రూ. 16 వందల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు పరిపాలనలో ప్రాజెక్టును పట్టించునే నాధుడే కరవయ్యాడన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు.
2. జిల్లాకు రామయ్యపట్నం పోర్టు వస్తుందని ఆశించాం. నెల్లూరు జిల్లా దుగ్గిరాజుపట్నానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. కొన్ని కారణాలతో నెల్లూరు జిల్లాలో కూడా రద్దు అయ్యిందని, రామయ్యపట్నం పోర్టును ప్రకాశం జిల్లాకు కేటాయించే విధంగా తీర్మానం చేశామన్నారు. పోర్టు వస్తే జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీలు వస్తాయన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలన్నారు.
3. దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రీ కారిడర్ అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ వచ్చిన పాపాన పోలేదన్నారు. దొనకొండ అభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు.
చదవండి:
నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్ విజయమ్మ
మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్ షర్మిల
'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్
ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు