విజయమే లక్ష్యం | YSRCP Target 12 Assembly and 3 Parliamentary seats | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యం

Published Wed, Jun 21 2017 4:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

విజయమే లక్ష్యం - Sakshi

విజయమే లక్ష్యం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలోని 12 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఒంగోలులోని సీతారామ ఫంక్షన్‌ హాలులో జరిగిన జిల్లా ప్లీనరీకి అధ్యక్షత వహించిన బాలినేని వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్లీనరీలో తీర్మానం చేసిన పలు ప్రధాన సమస్యలను ఆయన ప్రస్తావించారు.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు వేల కోట్లు నిధులిచ్చి నిర్మాణం సాగిస్తే... చంద్రబాబు సర్కారు మొక్కుబడిగా కూడా నిధులివ్వక ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాట్ల పట్ల చంద్రబాబు సర్కారు విముఖతతో ఉందని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పా టు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని విమర్శించారు.

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని బాబు సర్వనాశనం చేశాడు: పార్థసారథి
ఎన్‌టిఆర్‌ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి పార్థసారథి విమర్శించాడు. మహానాడు వేదికపై ఎన్‌టిఆర్‌ కుటుంబాలెవ్వరినీ లేకుండా చేశాడన్నారు. నారాయణ, గంటా వియ్యంకులైన మంత్రి పదవులిచ్చిన బాబు ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులకు పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: అంబటి
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు పతనం ఆరంభమైందన్నారు. ఆయన సమావేశాలు పెట్టిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలనలో బాబు జనాన్ని మోసగించటం తప్ప ఏమి చేయలేదన్నారు. ఆయన కుమారుడికి మైక్‌ ఇస్తే ఎప్పుడు మేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఈ మధ్య కాలంలో జగన్‌ను పొగిడి టీడీపీని తిడుతున్నాడని అంబటి ఎద్దేవా చేశారు.

విజయమే లక్ష్యంగా పని చేద్దాం: గోవిందరెడ్డి
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశంలో పార్టీ ప్లీనరీకి వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్‌కె రోజా,  జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి పార్థసారధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు,  బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, పిడ తల సాయికల్పనారెడ్డి, బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్త వరికూటి అమృతపాణి నియో జకవర్గ సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్, వరికూటి అశోక్‌బాబు,  గొట్టిపాటి భరత్,  తూమాటి మాధవరావు, ఐవీ రెడ్డి, సామాన్యకిరణ్, యడం బాలాజీ, ఒంగోలు నగరాధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు శింగరాజు వెంకట్రావు,

 చుండూరి రవి, కెవి రమణారెడ్డి, షేక్‌ సుభాని, సీనియర్‌ నాయకులు అక్కిరెడ్డి, వై.నాగరాజు, బడుగు కోటేశ్వరరావు, వరికూటి కొండారెడ్డి, పోకల అనురాధ, రమణమ్మ, వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, జిల్లా, నగర నాయకులు కెవి ప్రసాద్, గంటా రామానాయుడు, జజ్జర ఆనందరావు, ఓబుల్‌రెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, గంగాడ సుజాత, బడుగు ఇందిర, చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, జాజుల కృష్ణ, కాకుమాను సునీల్‌రాజ్, ధూళిపూడి ప్రసాద్, మీరావళి, వల్లెపు మురళి, గోవర్ధన్‌రెడ్డి, పటాపంజుల అశోక్, పామూరు రమణారెడ్డి, డేవిడ్, కాకుమాను రాజశేఖర్, గొర్రెపాటి శ్రీను, కోలా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ప్రజానాయకుడు కాదు.. : ఎంపీ మేకపాటి
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాడన్నారు. ఆయన మరణంతో వెలిగొండ కుంటి నడక నడుస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రజానాయకుడిగా ఉండవలసిన నాయకుడు కాదని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిడ్డనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మేకపాటి విమర్శించారు.

జగన్‌ సీఎం అయితేనే వైఎస్‌ సువర్ణ పాలన..: ఎంపీ వైవీ
జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే దివంగత వైఎస్‌ సువర్ణ పాలన తిరిగి వస్తుందని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. పాలన మొత్తం అవినీతిమయమైందని విమర్శించారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీని గంగలో కలిపాడన్నారు. మిరప రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఎంపీ చెప్పారు. జులై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీలో పార్టీ దశ, దిశ నిర్దేశించటం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.  ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.

టీడీపీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. రామాయపట్నం పోర్టును వెంటనే ప్రకటించాలన్నారు. రూ.40 వేల కోట్లతో 14 వేల ఎకరాల్లో కనిగిరి నిమ్జ్‌ను ప్రకటించిన ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్‌ హయాంలో 3,500 కోట్లు నిధులిచ్చారన్నారు. జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉన్న ఫ్లోరైడ్‌ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. జగన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేసినట్టు గుర్తుచేశారు.

ఒంగోలు కార్యకర్తలు పవర్‌ఫుల్‌ :  రోజా
ఒంగోలు గిత్తలే కాదు... ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పవర్‌ఫుల్‌ అని నగరి ఎమ్మెల్యే పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్‌కె రోజా కితాబిచ్చారు. కార్యకర్తలు అధికారం పోయిందన్న బాధను విడనాడాలన్నారు. వైఎస్, జగన్‌పై ఉన్న అభిమానాన్ని తట్టి లేపాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్‌ జిల్లాకు వెలిగొండ, రిమ్స్, మెడికల్‌ కాలేజీతో పాటు పలు అభివృద్ధి పనులు చేశాడన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు మేలు చేశాడన్నారు. రాజన్న రక్తం, రాయలసీమ పౌరుషం జగనన్న సీఎం కావాలన్నారు. జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు గంగలో కలిశాయని విమర్శించారు.  సీఎంగా ఉన్న కొడుకును గెలిపించుకోలేక అడ్డదారిని మంత్రిని చేసుకున్నాడని విమర్శించారు. బాబు మూడేళ్ళ పాలనలో ఒక్క పరిశ్రమ లేదన్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూనే ఆంధ్రాకు చంద్రబాబు బ్యాండ్‌ వేశాడన్నారు. జనం బాబుకు బ్యాండ్‌ వాయించే రోజు దగ్గర పడిందన్నారు. రాష్ట్రాన్ని వైఎస్‌ వ్యవసాయం నెం.1 చేస్తే చంద్రబాబు ఆత్మహత్యల్లో నెం.1 చేశాడని విమర్శించారు. వైఎస్‌ హయాంలో 48 లక్షల గృహాలు కడితే, చంద్రబాబు ఒక్క ఇల్లు కట్టలేదని రోజా విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement