'ఎల్లో మీడియాతో విషం చిమ్ముతున్న ప్రభుత్వం'
'ఎల్లో మీడియాతో విషం చిమ్ముతున్న ప్రభుత్వం'
Published Sun, Apr 2 2017 7:37 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
పామర్రు(కృష్ణా జిల్లా) : ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎల్లోమీడియాతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడం విధిగా పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక విష్ణాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు.
పార్థసారధి మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసే చర్యల్లో భాగంగా అనేక కంపెనీల్లో చేపడుతున్న పరిశీలనలను జగన్ కంపెనీల్లో భాగస్వామ్యం అనే అర్ధం వచ్చే విధంగా ఎల్లో పత్రికల్లో వార్తలు రావడం విచాకరంగా ఉందన్నారు. ఈడీ సంస్థ ఎక్కడా జగన్ సంస్థలకు సంబంధం ఉందని తెలుపలేదన్నారు.
కానీ ఎల్లో మీడియాలో వైఎస్ జగన్‌కు చెందిన రాజేశ్వర్ సంస్థ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తోందని వచ్చిన వార్తలు పచ్చి అబద్ధాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీడియా వాస్తవాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాకే క్యాబినెట్‌లోకి అనుమతించాలని అన్నారు.
Advertisement