మహానాడు బుర్రకథను తలపిస్తోంది : పార్థసారధి | YSRCP Leader Parthasarathy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

మహానాడు బుర్రకథను తలపిస్తోంది : పార్థసారధి

Published Tue, May 29 2018 1:20 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

YSRCP Leader Parthasarathy Fires on Chandrababu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి

సాక్షి, చిత్తూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సమావేశాలు బుర్రకథను తలపిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్‌లో  ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకే మహానాడు సమావేశాలు ఏర్పాటుచేశారని అన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తెలుగు ప్రజలకు ఏమి చేశారో చెప్పే దమ్ము, ధైర్యం లేదని దూషించారు. మహానాడు వేదికపై ప్రజలను కించపరిచే విధంగా మట్లాడుతుంటే బాబు ముసిముసి నవ్వులు నవ్వుతారా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్‌ మహానాడులో వంటల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. 

బీజేపీతో కలిసి హోదాను భూస్థాపితం
ప్రత్యేక హోదాపై చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్థసారధి దుయ్యబట్టారు. బీజేపీతో  కలిసి ప్రత్యేక హోదాను భూస్థాపితం చేశారని, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన తప్పిదాలను ప్రజల నుంచి దృష్టి మరల్చడంలో బాబు దిట్టని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement