ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదులో మన రాష్ట్రమే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఓటర్లకు బహుళ ప్రయోజనాలతో స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదులో మన రాష్ట్రమే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఓటర్లకు బహుళ ప్రయోజనాలతో స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పారు. ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ ఓటరు నమోదు వాహనాన్ని భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఓటింగ్ నమోదుపై విస్తృత ప్ర చారం అవసరమని చెప్పారు. దేశం లో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 59 శాతం ఆన్‌లైన్ ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్లు అందాయని తెలిపారు.
మొబైల్ వాహనాలతో అవగాహన
ఓటరు నమోదు కార్యక్రమంలో అవగాహన కల్పించేందుకు ఇన్ఫోటెక్, లీడ్ ఇండియా దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. వివిధ సం స్థల కార్యాలయాల వద్దకే వెళ్ళి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతామని ఇన్ఫోటెక్ చైర్మన్ అశోక్‌రెడ్డి తెలిపారు.