ఓ స్త్రీ రేపురా...
గతంలో కొన్ని గ్రామాల్లో దెయ్యం తిరుగుతుందనే భయంతో ఇంటి గోడలపై ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాశారు. ఆ ఘటనల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా తీసిన చిత్రం ‘ఓ స్త్రీ రేపురా’. అశోక్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, వంశీ కృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షా పంత్ తదితరులు నటించారు. ఘంటశాల విశ్వనాథ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ‘మధుర’శ్రీధర్ ఆవిష్కరించారు. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తామని అశోక్‌రెడ్డి తెలిపారు.