సోలార్ సిస్టంను పరిశీలించిన అధికారులు | officers observed the solar system | Sakshi
Sakshi News home page

సోలార్ సిస్టంను పరిశీలించిన అధికారులు

Published Mon, Dec 23 2013 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

officers  observed the solar system

రహీంఖాన్‌పేట(ఆత్మకూరు(ఎం), న్యూస్‌లైన్: విద్యుత్ కొరత నుంచి గట్టెక్కడానికి మండలంలోని రహీంఖాన్‌పేటలో రైతు కొత్త అశోక్‌రెడ్డి సొంత పరిజ్ఞానంతో తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టంను ఆదివారం ట్రాన్స్‌కో ఏఈ రాజేందర్‌సింగ్, వికారాబాద్ సీఐ వెంకట్‌రాంరెడ్డితో పాటు పలువురు రైతు లు పరిశీలించారు. సోలార్ సిస్టం ఏర్పా టు చేసిన విధానం గురించి వారు రైతును అడిగి తెలుసుకున్నారు. అశోక్‌రెడ్డి సాంకేతిక నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు.
 విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకే..
 విద్యుత్ సమస్యనుంచి గట్టెక్కేందుకే సొంత పరిజ్ఞానంతో సోలార్ సిస్టం ఏర్పా టు చేశానని రైతు ఆశోక్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 10 సోలార్ పీవీ ప్యానెల్ మ్యాడుల్ బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు డీసీ(డెరైక్ట్ కరెంట్), ఏసీ(ఆల్టర్‌నేట్ కరెంట్) స్టాటర్‌ను రూపొందించినట్లు చెప్పారు. వీ టి కొనుగోలుకు సుమారు * 2.50 లక్షలు ఖర్చు వచ్చిందన్నారు. సోలార్ సిస్టం నుంచి ఉత్పత్తయ్యే కరెంట్ ద్వారా 5 హెచ్‌పీ మోటార్ నిరంతరాయంగా నడుస్తుందన్నారు. పంప్‌సెట్ మోటార్ పగలం తా సోలార్ సిస్టంతో, రాత్రి కరెంట్ సహా యంతో నడుస్తుందని వివరించారు.

తనకున్న మూడున్నర ఎకరాల్లో ఎకరంన్నర తరి, రెండు ఎకరాలలో దానిమ్మ తోట సాగు చేశానని..  కరెంట్ సమస్యను అధిగమించడానికే సోలార్ ప్రయోగం చేశా నని అధికారులకు వివరించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి 50 శాతం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహిస్తే  కరెంట్ సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. సోలార్ సిస్టంను సందర్శిం చిన వారిలో అధికారులతో పాటు రైతులు ఏనుగు జితేందర్‌రెడ్డి, కొత్త అనంతరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పిన్నింటి మోహన్‌రెడ్డి, కొత్త భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement