rajender singh
-
కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదులను తమ అధీనంలోకి తీసుకోవడానికే కేంద్రం నదుల అనుసంధానానికి కుట్రలు చేస్తోందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే పురస్కార గ్రహీత రాజేందర్‌సింగ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి డబ్బులు నింపడం, అవినీతి, అక్రమాల కోసమే కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టిందని మండిపడ్డారు. వాటర్ ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్, మార్కెటైజేషన్కు కుట్ర పన్ను తోందని ఆరోపించారు. నదుల అనుసంధానంతో దేశానికి చెడు జరుగుతుందని, పర్యావరణ సమతు ల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని, అన్ని రకాలుగా ఇది ప్రజలకు తీరని నష్టాన్ని కలిగి స్తుందన్నారు. దేశంలో ఏ ఒక్క సీఎం కూడా తమ వాటా నీటిని ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధం గా లేరని గుర్తు చేశారు. జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ పెని న్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్, ఇండియన్ హిమాల యన్ రివర్ బేసిన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నదులపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. నీటి మేనిఫెస్టోను సదస్సులో విడుదల చేస్తామన్నారు. కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉందని రాజేందర్ అన్నారు. ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు ఇతర అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమని చెప్పారు. రాష్ట్రంలో జల వర్సిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు. అందుకే జాతీయ సదస్సు కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. నదులపై అవగాహన కల్పించడానికి చేపడుతున్న ఉద్యమంలో ప్రజలూ భాగస్వాములు కావాలి’ అని ఆయన చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, మూడు చెరువుల నుంచి ఆలయానికి నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని కితాబునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులను స్వాధీనంచేసుకోవానికి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సాగునీటి కోసం రూ.3–4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకుంటే ఎకరాకు రూ.5వేల ఖర్చు మాత్రమే అవుతుందని ఉదహరించారు. -
'దాడి చేస్తారని నేను ఊహించలేదు'
అమరావతి: తనపై దాడి చేస్తారని అస్సలు ఊహించలేదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ అన్నారు. తనకు అమరావతిలో ఎవరితోనూ గొడవలు లేవని చెప్పారు. ఇంతకుముందు ఎన్నో దాడులు జరిగినా నిన్న జరిగిన దాడిని మాత్రం తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు లాక్కుంటున్నారని రైతులు చెబుతున్నారని, రైతులు, నదీ హక్కుల కోసం తాను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి రాజేందర్ సింగ్ బృందంపై దాడి చేయడం దారుణం అని ఏక్తా పరిషత్ చైర్మన్ రాజగోపాల్ అన్నారు. దాడిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ సింగ్ బృందానికి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తాము దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
ఆక్రమణలు నివారిస్తే ‘మిషన్’అద్భుతం
అధికారులతో మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని నదులన్నీ ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో చిన్న నీటి వనరుల సంరక్షణ, వాటి అభివృద్ధి అత్యంత ముఖ్యమని మెగసెసె అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికే ఆదర్శమని, దీన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చెరువుల ఆక్రమణలు నివారించగలిగితే ఈ కార్యక్రమం అద్భుత ఫలితాన్నిస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. అనంతరం హైదరాబాద్‌లో నీటి పారుదల అధికారులతో జలసౌధలో సమావేశమయ్యారు. నీటి సంరక్షణ, నిర్వహణ తదితర అంశాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. మిషన్ కాకతీయతో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ప్రశంసనీయమని, దీనిద్వారా ‘మన ఊరు-మన చెరువు-మన అభివృద్ధి’ అనే భావన ప్రజల్లో పెరుగుతుందన్నారు. చెరువుల పరిరక్షణకు కఠిన చట్టాలను అమలుచేస్తే మరింత ఫలితం ఉంటుందని తెలిపారు. -
సోలార్ సిస్టంను పరిశీలించిన అధికారులు
రహీంఖాన్‌పేట(ఆత్మకూరు(ఎం), న్యూస్‌లైన్: విద్యుత్ కొరత నుంచి గట్టెక్కడానికి మండలంలోని రహీంఖాన్‌పేటలో రైతు కొత్త అశోక్‌రెడ్డి సొంత పరిజ్ఞానంతో తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టంను ఆదివారం ట్రాన్స్‌కో ఏఈ రాజేందర్‌సింగ్, వికారాబాద్ సీఐ వెంకట్రాంరెడ్డితో పాటు పలువురు రైతు లు పరిశీలించారు. సోలార్ సిస్టం ఏర్పా టు చేసిన విధానం గురించి వారు రైతును అడిగి తెలుసుకున్నారు. అశోక్‌రెడ్డి సాంకేతిక నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు. విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకే.. విద్యుత్ సమస్యనుంచి గట్టెక్కేందుకే సొంత పరిజ్ఞానంతో సోలార్ సిస్టం ఏర్పా టు చేశానని రైతు ఆశోక్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 10 సోలార్ పీవీ ప్యానెల్ మ్యాడుల్ బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు డీసీ(డెరైక్ట్ కరెంట్), ఏసీ(ఆల్టర్నేట్ కరెంట్) స్టాటర్‌ను రూపొందించినట్లు చెప్పారు. వీ టి కొనుగోలుకు సుమారు * 2.50 లక్షలు ఖర్చు వచ్చిందన్నారు. సోలార్ సిస్టం నుంచి ఉత్పత్తయ్యే కరెంట్ ద్వారా 5 హెచ్‌పీ మోటార్ నిరంతరాయంగా నడుస్తుందన్నారు. పంప్‌సెట్ మోటార్ పగలం తా సోలార్ సిస్టంతో, రాత్రి కరెంట్ సహా యంతో నడుస్తుందని వివరించారు. తనకున్న మూడున్నర ఎకరాల్లో ఎకరంన్నర తరి, రెండు ఎకరాలలో దానిమ్మ తోట సాగు చేశానని.. కరెంట్ సమస్యను అధిగమించడానికే సోలార్ ప్రయోగం చేశా నని అధికారులకు వివరించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి 50 శాతం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహిస్తే కరెంట్ సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. సోలార్ సిస్టంను సందర్శిం చిన వారిలో అధికారులతో పాటు రైతులు ఏనుగు జితేందర్‌రెడ్డి, కొత్త అనంతరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పిన్నింటి మోహన్‌రెడ్డి, కొత్త భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.