'దాడి చేస్తారని నేను ఊహించలేదు'
అమరావతి: తనపై దాడి చేస్తారని అస్సలు ఊహించలేదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ అన్నారు. తనకు అమరావతిలో ఎవరితోనూ గొడవలు లేవని చెప్పారు. ఇంతకుముందు ఎన్నో దాడులు జరిగినా నిన్న జరిగిన దాడిని మాత్రం తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు లాక్కుంటున్నారని రైతులు చెబుతున్నారని, రైతులు, నదీ హక్కుల కోసం తాను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
రాజేందర్ సింగ్ బృందంపై దాడి చేయడం దారుణం అని ఏక్తా పరిషత్ చైర్మన్ రాజగోపాల్ అన్నారు. దాడిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ సింగ్ బృందానికి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తాము దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.