ఝాన్సీ : మహాకుంభమేళాకు వెళుతున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్లో ఝాన్సీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్తున్న రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ రైలు మహా కుంభమేళాకు వెళుతోంది.
ఝాన్సీ డివిజన్లోని హర్పాల్పూర్ స్టేషన్లో సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా రైలుపై దాడి జరిగిన నేపధ్యంలో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అల్లరిమూకలు రైలులోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో కిటికీలను పగులగొట్టారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.
విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు రైల్వే రక్షణ దళం పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఛతర్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మిక్ చౌబే మాట్లాడుతూ ఛతర్పూర్ రైల్వే స్టేషన్లో గేటు తెరవకపోవడంతో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు రైలుపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ రైలు ఛతర్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వెళుతోందని, దాడికి పాల్పడినవారంతా పరారయ్యారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment