Water Man of India
-
'ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో మోసం'
సాక్షి, అమరావతి: నదీ పరిరక్షణ చట్టానకి విరుద్ధంగా కృష్ణానది గర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారని వాటర్‌మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మండిపడ్డారు. నదుల అనుసంధానం ప్రకృతికి విరుద్ధమైన చర్య అని, పెను విధ్వంసానికి కారణం అవుతుందని హెచ్చరించారు. ఈషా ఫౌండేషన్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో నదుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి.. నదీ తీరంలో అక్రమ కట్టడాలను ఎందుకు ఆపడంలేదని మండిపడ్డారు. నదీ గర్భ ప్రాంతం నివాసానికి అనుకూలం కాదని, అయినా సీఎం అక్కడే నివాసం ఉండటం చట్ట విరుద్ధం అన్నారు. ఈషా ఫౌండేషన్పైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. జగ్గీవాస్‌దేవ్ ఉద్యమం వెనుక కార్పొరేట్ రాజకీయ లబ్ధి ఉందని విమర్శించారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘించడం సరికాదని రాజేంద్రసింగ్ అన్నారు. -
'దాడి చేస్తారని నేను ఊహించలేదు'
అమరావతి: తనపై దాడి చేస్తారని అస్సలు ఊహించలేదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ అన్నారు. తనకు అమరావతిలో ఎవరితోనూ గొడవలు లేవని చెప్పారు. ఇంతకుముందు ఎన్నో దాడులు జరిగినా నిన్న జరిగిన దాడిని మాత్రం తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు లాక్కుంటున్నారని రైతులు చెబుతున్నారని, రైతులు, నదీ హక్కుల కోసం తాను పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి రాజేందర్ సింగ్ బృందంపై దాడి చేయడం దారుణం అని ఏక్తా పరిషత్ చైర్మన్ రాజగోపాల్ అన్నారు. దాడిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ సింగ్ బృందానికి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తాము దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
చంపేస్తాం.. తగలబెడ్తాం..
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్‌పై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సహించబోమని, కాదని ప్రయత్నిస్తే చంపేస్తామని, యాత్రలంటూ వాహనాల్లో తిరిగితే తగలబెడ్తామంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్‌ను హెచ్చరించారు. కృష్ణా నది పరిరక్షణ యాత్ర పేరిట మూడు రోజులుగా నదీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తున్న రాజేంద్రసింగ్ కాన్వాయ్‌ను సినీఫక్కీలో వెంబడించి, కార్లతో అటకాయించి దాదాపు గంటపాటు నిర్బంధించారు. రాజేంద్రసింగ్‌పై దాడికి యత్నించారు. సర్ది చెప్పబోయిన స్థానిక రైతుపై చేయి చేసుకున్నారు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందంటూ ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన సత్యనారాయణను కారులో నుంచి బయటకు లాగి దాడికి ప్రయత్నించడంతో పోలీసులు వచ్చి నిలువరించారు. రాజేంద్రసింగ్ టీడీపీ నేతలతో మాట్లాడుతూ.. ‘మేము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. నదీపరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మించవద్దంటూ యాత్ర చేపట్టాం. కృష్ణానదిని కాపాడాలన్నదే మా లక్ష్యం’ అని వివరించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య అమరావతి బయలుదేరారు.