సర్ది చెప్పబోయిన స్థానిక రైతుపై చేయి చేసుకున్నారు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందంటూ ఎన్‌జీటీకి ఫిర్యాదు చేసిన సత్యనారాయణను కారులో నుంచి బయటకు లాగి దాడికి ప్రయత్నించడంతో పోలీసులు వచ్చి నిలువరించారు. రాజేంద్రసింగ్ టీడీపీ నేతలతో మాట్లాడుతూ.. ‘మేము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు. నదీపరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మించవద్దంటూ యాత్ర చేపట్టాం. కృష్ణానదిని కాపాడాలన్నదే మా లక్ష్యం’ అని వివరించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య అమరావతి బయలుదేరారు.
చంపేస్తాం.. తగలబెడ్తాం..
Published Sat, Aug 5 2017 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్‌పై తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సహించబోమని, కాదని ప్రయత్నిస్తే చంపేస్తామని, యాత్రలంటూ వాహనాల్లో తిరిగితే తగలబెడ్తామంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్‌ను హెచ్చరించారు. కృష్ణా నది పరిరక్షణ యాత్ర పేరిట మూడు రోజులుగా నదీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తున్న రాజేంద్రసింగ్ కాన్వాయ్‌ను సినీఫక్కీలో వెంబడించి, కార్లతో అటకాయించి దాదాపు గంటపాటు నిర్బంధించారు. రాజేంద్రసింగ్‌పై దాడికి యత్నించారు.

Advertisement
Advertisement