ఉస్మానియా యూనివర్సిటీ: తాగిన మైకంలో ఓ భర్త ... భార్య మెడకు బెల్టు బిగించి హత్య చేసిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన ఇషాసింగ్ (30)తో చాదర్‌గట్‌కు చెందిన నగర నివాసి మిర్జాహుస్సెన్‌అలీ (34) ఎనమిది సంవత్సరాల క్రితం ప్రేమా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. హబ్సిగూడ వీధినంబర్.8లో ఇండిపెండెంట్ హౌజ్‌లో ఉంటు రోలింగ్ షట్టర్స్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. గత కొంత కాలం భార్య, భర్తల మధ్య చిన్న చితక విషయాలకు గొడవలు ప్రారంభమైనవి.
బుధవారం ఇషాసింగ్ తన పిల్లను కొట్టింది. పిల్లలను ఎందుకు కొట్టావని భర్త గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. అప్పటికె తాగి ఉన్న భర్త మిర్జాహుస్సెన్‌అలీ నడుముకు గల బెల్టును భార్య మెడకు బిగించి చనిపోయోవరకు గట్టిగా లాగాడు. ఊపిరాడని ఇషాసింగ్ అప్పటికప్పుడే మతి చెందింది. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి భర్త మిర్జాహుస్సెన్‌అలీని అరెస్ట్ చేసి ఇషాసింగ్ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
బెల్టుతో భార్యను హతమార్చిన భర్త
Published Thu, Sep 17 2015 12:02 AM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM
Advertisement
Advertisement