నల్లధనం సౌదీకి తరలించిన చరిత్ర కేసీఆర్‌ది..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
నల్లబెల్లి(నర్సంపేట): ఫాంహౌజ్‌లో దాచుకున్న కోట్లాది రూపాయల నల్లధనాన్ని సౌదీ అరేబియాకు తరలించుకున్న చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో టీజేఏసీ నాయకుడు వేముల రాజు పోరు బిడ్డల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం ప్రకటించిన అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయగానే దివాళాకోరు పనిగా అభివర్ణించిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోతోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి కొలువులు కల్పించారని ఎద్దేవా చేశారు. మోసపురిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీక్షలకు బీజేపీ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజుకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త దశరథం, రేవూరి రాజేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి సంఘీబావం తెలపగా టీ జేఏసీ నాయకులు వేముల రాజు, కోల లింగయ్య, ఎన్నమల నర్సయ్య, వడ్లురి సత్యం, నాగంపెల్లి వీరన్న, పబ్బోజు నర్సింహచారి, వంగ ఉపేందర్, బోజ్య, హచ్చు కూర్చున్నారు.