వెంకీ శతకం.. 'కింగ్‌' ఖాన్‌ కూతురు ఏం చేసిందంటే? | Suhana Khan Epic Reaction-Venkatesh Iyer Celebrates Maiden IPL Century | Sakshi
Sakshi News home page

వెంకీ శతకం.. 'కింగ్‌' ఖాన్‌ కూతురు ఏం చేసిందంటే?

Published Sun, Apr 16 2023 6:46 PM | Last Updated on Mon, Apr 17 2023 8:25 AM

Suhana Khan Epic Reaction-Venkatesh Iyer Celebrates Maiden IPL Century - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ శతకంతో మెరిశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అయ్యర్‌ సెంచరీ మార్క్‌ సాధించాడు. ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. కేకేఆర్‌ తరపున ఇది రెండో ఐపీఎల్‌ సెంచరీ మాత్రమే. ఇంతకముందు ఐపీఎల్‌ తొలి సీజన్‌ 2008లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(158*పరుగులు) మాత్రమే కేకేఆర​ తరపున సెంచరీ సాధించాడు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ తన తొలి ఐపీఎల్‌ శతకంతో మెరవడమే కాదు.. కేకేఆర్‌ తరపున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇక 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో శతకం మార్క్‌ అందుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే వెంకీ చేసిన సెలబ్రేషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శతకం సాధించగానే రెండు చేతులతో బ్యాట్‌ను పట్టుకొని భారతీయ సంప్రదాయ పద్దతిలో మొక్కుతూ కనిపించాడు.

ఆ తర్వాత కేకేఆర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తూ ఈ సెంచరీ మీకోసమే అన్నట్లుగా గెస్టర్‌ ఇచ్చాడు.. మరి ఆ సైగ ఎవరికి ఇచ్చాడా అని తిరిగిచూస్తే ఎదురుగా కింగ్‌ ఖాన్‌.. షారుక్‌ కూతురు సుహానా ఖాన్‌ కనిపించింది.వెంకీ అలా చేయగానే ఆమె నవ్వుతూ చప్పట్లతో అభినందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబై, కేకేఆర్‌ మ్యాచ్‌ ఏమో గానీ ఇరుజట్లలో కీలకపాత్రల్లో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌, షారుక్‌ ఖాన్‌ల ముద్దుల తనయలు ఈ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఒక ఎండ్‌లో సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌.. మరో ఎండ్‌లో షారుక్‌ కూతురు సుహానా ఖాన్‌లు తమ జట్లను ఎంకరేజ్‌ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఇవాళ్లి మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

చదవండి: #venkateshIyer: నొప్పిని భరిస్తూనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement