గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే! | IPL 2023-Hrithik Shokeen-Nitish Rana Get Involved Heated Exchange Viral | Sakshi
Sakshi News home page

Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!

Published Sun, Apr 16 2023 5:39 PM | Last Updated on Sun, Apr 16 2023 6:26 PM

IPL 2023-Hrithik Shokeen-Nitish Rana Get Involved Heated Exchange Viral - Sakshi

Photo: IPL Twitter

క్రికెట్‌లో ఇద్దరి ఆటగాళ్ల మధ్య గొడవ జరగడం సహజం. ఒక్కోసారి ఆటగాళ్లు సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాడిపై దూషణకు దిగుతుంటారు. ఒక్కోసారి ఈ గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునే వరకు వెళ్తుంది. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇలాంటిదే చోటు చేసుకుంది. కేకేఆర్‌ కెప్టెన్‌ నితీష్‌ రానా, ముంబై బౌలర్‌ హృతిక్‌ షోకీన్‌ల మధ్య మాటల యుద్ధం కొట్టుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది.


Photo: IPL Twitter

అయితే ఇక్కడ తప్పు హృతిక్‌ షోకీన్‌దే అని క్లియర్‌గా తెలుస్తోంది. షోకీన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తాను ఔటయానన్న బాధలో కామ్‌గా పెవిలియన్‌ వెళ్తున్న నితీష్‌ రానాను చూస్తూ హృతిక్‌ షోకీన్‌ వెకిలిగా ప్రవర్తించాడు.. పెవిలియన్‌ వెళ్లు అన్నట్లుగా వేలు చూపించాడు. దీంతో నితీశ్‌ రానాకు కోపం నషాళానికెక్కింది. ఒక్కసారిగా హృతిక్‌ షోకిన్‌పై అసభ్య పదజాలంలో విరుచుకుపడ్డాడు.


Photo: IPL Twitter

ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ముంబై స్టాండిన్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కల్పించుకొని నితీశ్‌ రానాను అక్కడినుంచి తీసుకెళ్లాడు. అయితే నితీశ్‌ పెవిలియన్‌ వెళ్తూ కూడా హృతిక్‌పై తన తిట్ల పురాణం ఆపలేదు. ఒక రకంగా కామ్‌గా వెళ్తున్న వ్యక్తిని గెలికి మరీ తిట్టుంచుకోవడం అంటే ఇదే కావొచ్చు. ఇక  హృతిక్‌ చేసిన చిన్న తప్పిదానికే నితీశ్‌ ఇంతలా రియాక్ట్‌ అవడం ఏంటని అభిమానులు ఆరా తీస్తే అసలు కారణం బయటపడింది.

నితీశ్‌ రియాక్షన్‌కు అసలు కారణం ఇదే..
నితీశ్‌ రానా, హృతిక్‌ షోకీన్‌లు ఇద్దరు దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ తరపునే ఆడుతున్నారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటినుంచి ఇద్దరు ఎక్కడ ఎదురుపడినా మాట్లాడుకోవడం లేదు. ఢిల్లీ జట్టు తరపున ఆడేటప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఇద్దరు మాట్లాడుకుందే లేదట.


Photo: IPL Twitter

ఇక రంజీ ట్రోఫీలో భాగంగా బ్యాటింగ్‌ చేసే సమయంలో ఇద్దరు క్రీజులో ఉన్నప్పటికి ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ''ఎంత గొడవ జరిగితే ఇద్దరి మధ్య ఇంత పంతం అవసరమా'' అని కొందరు అభిమానులు పేర్కొనగా.. ''ఎంతకాదన్నా నితీశ్‌ రానా సీనియర్‌ ప్లేయర్‌.. ఒక సీనియర్‌ ఆటగాడిపై అలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదు.. నితీశ్‌ కరెక్టుగానే రియాక్ట్‌ అయ్యాడు'' అంటూ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement