Hrithik Shokeen
-
చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా
BCCI Punishes Nitish Rana- Hrithik Shokeen- Suryakumar Fined: ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ టీమిండియా టీ20 స్టార్‌కు 12 లక్షల జరిమానా పడింది. కాగా ఐపీఎల్-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్ తలపడింది. రోహిత్ స్థానంలో సారథిగా ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేర ఫైన్ విధించారు. ఇక సొంత మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌ను 186 పరుగులకు కట్టడి చేసింది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ(104)తో మెరవడంతో కోల్‌కతా ఈ మేరకు స్కోరు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్ శర్మ(20) ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ(58)తో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 43 పరుగులతో రాణించగా.. తిలక్ వర్మ 30, టిమ్ డేవిడ్ 24(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈ సీజన్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నితీశ్ రాణా మ్యాచ్ ఫీజులో కోత.. ముంబై బౌలర్ హృతిక్ షోకీన్- కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరికీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. మైదానంలో పరస్పరం అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఇరువురి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్ రాణా ఫీజులో 25 శాతం కోత పెట్టారు. ముంబై బౌలర్‌కూ ఫైన్ అదే విధంగా.. హృతిక్ షోకీన్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ దేశవాళీ క్రికెట్లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ తరఫున ఆడుతూ సహచర ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఐపీఎల్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న ఈ ఇద్దరు అనవసరపు గొడవతో చెత్తగా ప్రవర్తించి క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. తమ తప్పులు అంగీకరించి బీసీసీఐ విధించిన ఫైన్ రూపంలో మూల్యం కూడా చెల్లించుకున్నారు. చదవండి: వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే? #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. 2⃣ wins in a row for @mipaltan! 👏 👏#MI beat #KKR by 5 wickets to bag two more points! 👍 👍 Scorecard ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/9oYgBrF0Fe — IndianPremierLeague (@IPL) April 16, 2023 -
గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!
క్రికెట్లో ఇద్దరి ఆటగాళ్ల మధ్య గొడవ జరగడం సహజం. ఒక్కోసారి ఆటగాళ్లు సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాడిపై దూషణకు దిగుతుంటారు. ఒక్కోసారి ఈ గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునే వరకు వెళ్తుంది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటిదే చోటు చేసుకుంది. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా, ముంబై బౌలర్ హృతిక్ షోకీన్‌ల మధ్య మాటల యుద్ధం కొట్టుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది. Photo: IPL Twitter అయితే ఇక్కడ తప్పు హృతిక్ షోకీన్దే అని క్లియర్‌గా తెలుస్తోంది. షోకీన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తాను ఔటయానన్న బాధలో కామ్‌గా పెవిలియన్ వెళ్తున్న నితీష్ రానాను చూస్తూ హృతిక్ షోకీన్ వెకిలిగా ప్రవర్తించాడు.. పెవిలియన్ వెళ్లు అన్నట్లుగా వేలు చూపించాడు. దీంతో నితీశ్ రానాకు కోపం నషాళానికెక్కింది. ఒక్కసారిగా హృతిక్ షోకిన్పై అసభ్య పదజాలంలో విరుచుకుపడ్డాడు. Photo: IPL Twitter ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ముంబై స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కల్పించుకొని నితీశ్ రానాను అక్కడినుంచి తీసుకెళ్లాడు. అయితే నితీశ్ పెవిలియన్ వెళ్తూ కూడా హృతిక్‌పై తన తిట్ల పురాణం ఆపలేదు. ఒక రకంగా కామ్‌గా వెళ్తున్న వ్యక్తిని గెలికి మరీ తిట్టుంచుకోవడం అంటే ఇదే కావొచ్చు. ఇక హృతిక్ చేసిన చిన్న తప్పిదానికే నితీశ్ ఇంతలా రియాక్ట్ అవడం ఏంటని అభిమానులు ఆరా తీస్తే అసలు కారణం బయటపడింది. నితీశ్ రియాక్షన్‌కు అసలు కారణం ఇదే.. నితీశ్ రానా, హృతిక్ షోకీన్‌లు ఇద్దరు దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరపునే ఆడుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటినుంచి ఇద్దరు ఎక్కడ ఎదురుపడినా మాట్లాడుకోవడం లేదు. ఢిల్లీ జట్టు తరపున ఆడేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇద్దరు మాట్లాడుకుందే లేదట. Photo: IPL Twitter ఇక రంజీ ట్రోఫీలో భాగంగా బ్యాటింగ్ చేసే సమయంలో ఇద్దరు క్రీజులో ఉన్నప్పటికి ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ''ఎంత గొడవ జరిగితే ఇద్దరి మధ్య ఇంత పంతం అవసరమా'' అని కొందరు అభిమానులు పేర్కొనగా.. ''ఎంతకాదన్నా నితీశ్ రానా సీనియర్ ప్లేయర్.. ఒక సీనియర్ ఆటగాడిపై అలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదు.. నితీశ్ కరెక్టుగానే రియాక్ట్ అయ్యాడు'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/zwPKyZIFzM — WPL MAHARASTRA (@WMaharastra) April 16, 2023 Not surprised to see this between Nitish Rana and Hrithik Shokeen. They have a history. Don’t talk in the dressing room. It all started in the Syed Mushtaq Ali Trophy. Both weren’t talking while batting in Ranji too. Rana is a senior player and Shokeen needs to ZIP UP! — Sahil Malhotra (@Sahil_Malhotra1) April 16, 2023