Photo: IPL Twitter
స్కూప్ షాట్లకు పెట్టింది పేరు సూర్యకుమార్ యాదవ్. అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్‌లో చాలాసార్లు స్కూప్ షాట్ ఆడి సక్సెస్ అయ్యాడు. అలాంటి సూర్యకు స్కూప్ షాట్ కొట్టిన పిండి. కానీ ప్రతీసారి కలిసొస్తుందని చెప్పలేం. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో అదే నిరూపితమైంది.
లక్నోతో మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సూర్య ఇబ్బంది పడ్డాడు. 9 బంతులెదుర్కొన్న సూర్య ఏడు పరుగులు చేసి చివరకు ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. యష్ ఠాకూర్ వేసిన ఓవర్ తొలి బంతిని స్కూప్ షాట్ ఆడబోయి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో సూర్య క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య ఔటైన విధానంపై అభిమానులు స్పందించారు. ప్రతీసారి మనది కాదు సూర్య.. కాస్త జాగ్రత్తగా ఆడాల్సింది. అంటూ కామెంట్ చేశారు.
Guys,What’s your opinion about AB de villiers now???@ABdeVilliers17 @surya_14kumar #LSGvMI #IPL2023 pic.twitter.com/WhTVCxdGDR
— NURUL HAQUE (@i_nurulhaque) May 16, 2023
చదవండి: జోర్డాన్‌కు చుక్కలు.. ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక స్కోరు
Comments
Please login to add a commentAdd a comment