
Photo: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్ సూర్యను గాయపరిచింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన అక్షర్ నాలుగో బంతిని కూడా లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈసారి సూర్య బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.
అయితే చేతి నుంచి పట్టుజారిన బంతి సూర్య కుడి కంటి పైభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కంటికి చిన్న గాయమైంది. ఫిజియో వచ్చి పరీశీలించి డగౌట్‌కు తీసుకెళ్లాడు. కంటి పైభాగంలో ఏర్పడిన గాయానికి కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి సూర్య గాయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కాస్త ఆందోళన రేపింది. ఇక మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 24 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటైన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
Suryakumar Yadav seems to have hurt himself while attempting that catch of Axar Patel! #DCvMI #IPL2023 pic.twitter.com/0m06aQKbFy
— Mohsin Kamal (@64MohsinKamal) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment