అర్జున్ టెండుల్కర్ (PC: IPL)
IPL 2023 LSG Vs MI- Arjun Tendulkar : ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.
ముంబై నుంచి మా దోస్త్ వచ్చాడు
ఈ క్రమంలో లక్నో తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ముంబై నుంచి మా దోస్త్ వచ్చాడు’’ అంటూ సోమవారం పంచుకున్న ఆ వీడియోలో అర్జున్ టెండుల్కర్ చెప్పిన విషయమే ఇందుకు కారణం.
కాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు, బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ తాజా ఎడిషన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు క్యాష్‌రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్ తీశాడు.
ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు అర్జున్ టెండుల్కర్. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌కు సిద్ధమైన.. ప్రాక్టీస్ సందర్భంగా జెయింట్స్ ఆటగాళ్లను కలిశాడు.
కుక్క కరిచింది
లక్నో యువ బౌలర్ యుధ్‌వీర్ సింగ్‌తో ముచ్చటించాడు. ఈ క్రమంలో.. అర్జున్‌ను ఆలింగనం చేసుకున్న యుధ్‌వీర్ ..‘ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా!’’ అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘కుక్క కరిచింది’’ అని సమాధానమిచ్చాడు. ‘‘అవునా ఎప్పుడు’’ అంటూ యుధ్‌వీర్ అడగ్గా.. ‘నిన్ననే’ అని బదులిచ్చాడు.
ఇరగదీస్తున్నావు బ్రో
ఇక తర్వాత మొహ్సిన్ ఖాన్‌ను కలిసిన అర్జున్.. బౌలింగ్ ఇరదీస్తున్నావు బ్రో అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో అర్జున్‌ను కుక్క కరిచిందా? ఇది కూడా వార్తే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు!! కాగా ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన మ్యాచ్‌లో అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు.
లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, జాసన్ బహ్రెండార్ఫ్.
చదవండి: గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్ షమీ
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023
Comments
Please login to add a commentAdd a comment