కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.
భారతదేశంలోని చిక్‌మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్‌తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్‌లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట.
ఎలా తయారు చేస్తారంటే..
ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్‌మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట.
కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట.
చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్‌తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్‌మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.
(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment