గమ్మత్తయిన నిజాలు | Funny facts | Sakshi
Sakshi News home page

గమ్మత్తయిన నిజాలు

Published Thu, Jul 31 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

గమ్మత్తయిన నిజాలు

గమ్మత్తయిన నిజాలు

బీరు.... నీరు, తేనీరు తరువాత మనిషి నోరు తడుపుకోవడానికి ఎక్కువగా వాడే ద్రవపదార్థం. బీసీ కాలం నుంచి బీరు జీవులు మనుగడలోనే ఉన్నారు. మత్తెక్కించే బీరు గురించి కొన్ని గమ్మత్తై నిజాలు...
 
 1814లో లండన్‌లో బీరు ఒలికిందట. ఒకటో, రెండో చుక్కలు కాదు... 3,88,000 గ్యాలన్లు! ఒక్కసారిగా లండన్‌లోని ఓ బారీ వాట్ (బీరుని నింపి వుంచే ట్యాంక్) పగలడంతో నిజంగానే బీరు ఏరులై పారింది.
     
 అకీలా అనే నక్షత్ర కూటమిలో ఒక భారీ మేఘం ఉంది. విచిత్రం ఏంటంటే, ఆ మేఘం మిథైల్ ఆల్కహాల్ (బీరులో ఉండే ముఖ్యమైన రసాయనం) తో నిండి ఉంది. దానితో 400 ట్రిలియన్ ట్రిలియన్ పైంట్స్ బీరుని తయారుచేయొచ్చు.
     
 బీరులో ఫ్యాట్ పర్సంటేజ్ జీరో.
     
జపాన్ వాళ్లు అంతరిక్షంలో బార్లీని పండించి, ఆ గింజలతో బీరుని తయారుచేశారట! దానికి ‘స్పేస్ బార్లీ’ అని పేరు పెట్టి, లాటరీ ద్వారా విక్రయించారు. వచ్చిన ఆదాయాన్ని చారిటీ కోసం వినియోగించారు.
     
 మధ్యయుగంలో మంచినీళ్ల కన్నా బీరునే ఎక్కువ తాగేవారట. అందుకు కారణం అప్పటి మంచినీటిలో క్రిములు ఎక్కువగా ఉండడమే! బీరులోని ఆల్కహాల్ ఆ క్రిములని నశింపజేయడంతో ఆ నీరు శుద్ధి అయ్యేదట!
     
 చంద్రమండలం నుండి సేకరించబడిన శకలాలను పొడి చేసి ‘సెలెస్ట్ - జువెల్ - ఏల్’ అనే బీరుని ‘డాగ్‌ఫిష్ హెడ్’ అనే అమెరికన్ బీర్ కంపెనీ తయారుచేసింది! చేస్తోంది కూడా!
   
 సెనోసిల్లిసెఫోబియా (CENOSILLICEPHOBIA)ఖాళీ బీర్ గ్లాసుని చూస్తే కలిగే ఫోబియా.
     
 ఆటమిక్ మోడల్‌తో నోబెల్ ప్రైజ్ సంపాదించిన నీల్స్‌బోర్‌కి అందిన బహుమానం ఒక స్థానిక బీర్ కంపెనీ నుండి అతని ఇంటికి బీర్ పైప్‌లైన్! అతనింట్లో కుళాయి విప్పితే బీరు వస్తుందన్నమాట!
     
 ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ల నిర్మాణంలో సహాయం చేసిన కూలీలకు జీతం ఏంటో తెలుసా! నాలుగు లీటర్ల బీరు! స్వేదానికి మద్యం పథకం!
     
 మ్యాథ్యూ హాగ్ బాడీ... ఒక పెద్ద బీర్ ఫ్యాక్టరీ! అతని శరీరం అచ్చంగా బీరుని తయారుచేస్తుంది. ఆటో ఫెర్మంటేషన్ సిండ్రోమే దానికి కారణం. అతని పేగులలో ‘ఈస్ట్’ బ్యాక్టీరియా చిక్కుకుపోయి ఉండడంతో అతను బార్లీ, బ్రెడ్ లాంటివి తింటే, అవి ఈస్ట్‌తో కలిసి బీరులా మారుతుందట! దాని వల్ల 24 గంటలూ హ్యాంగోవర్‌లోనే ఉంటున్నాడట పాపం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement