అబిడ్స్: నుమాయిష్‌ను రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ తీర్మానం చేసింది. జనవరి 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 15న ముగియాల్సి ఉంది. ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమైనందున మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15న ముగిసే ఎగ్జిబిషన్ ఈసారి 17న ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment