చేనేతకు గోకూప్ చేయూత..! | gocoop.com help for hand made crafts | Sakshi
Sakshi News home page

చేనేతకు గోకూప్ చేయూత..!

Published Sat, Nov 26 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

చేనేతకు గోకూప్ చేయూత..!

చేనేతకు గోకూప్ చేయూత..!

ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తుల విక్రయం
10 రాష్ట్రాల్లోని 275 సంఘాలతో ఒప్పందం
చీరలు, బ్యాగులు, నగల వంటి 20 వేలకుపైగా ఉత్పత్తులు
నెలకు 5 వేల ఆర్డర్లు; 30 శాతం విదేశాల నుంచే
2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ
గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరణ కూడా..
‘స్టార్టప్ డైరీ’తో గోకూప్ ఫౌండర్ అండ్ సీఈఓ శివ దేవిరెడ్డి 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేనేత కార్మికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల్లో చాటిచెప్పే చీరలను నేసేదీ వీళ్లే! మరి, నిజంగా దేశంలో నేత కార్మికులకు అంతటి గౌరవం దక్కుతోందా..? సమాధానం కష్టమే! గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం వారి కష్టానికి తగిన ప్రతిఫలమూ దక్కట్లేదు. ఒక్క చీరలే కాదు! నేత కార్మికులు తయారు చేసే ప్రతి ఉత్పత్తీ ప్రజాదరణ ఉన్నదే. కాకపోతే వారికి తెలియం దల్లా... ఆయా ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని!! ఇదిగో.. అలాంటి కష్టాలకు చెక్ చెబుతోంది ‘గోకూప్’!

రూ.80 లక్షల పెట్టుబడితో 2011లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గోకూప్ సొల్యూషన్‌‌స అండ్ సర్వీసెస్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ శివ దేవిరెడ్డి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘గోకూప్ అంటే ‘గో’ అంటే విశ్వమంతా(గ్లోబల్); ‘కూప్’ అంటే నలుగురం కలిసి (కో-ఆపరేటివ్) అని అర్థం. మొత్తంగా కలిపితే.. విశ్వమంతా నలుగురం కలిసి ముందుకెళదామని దానర్థం. దేశంలోని అన్ని చేనేత సంఘాలు, కార్మికుల దగ్గరకు స్వయంగా గోకూప్ వెళుతుంది. వారి ఉత్పత్తులను ఆన్‌లైన్ వేదికగా విక్రరుుంచేందుకు వారితో ఒప్పందం చేసుకుంటుంది. తయారైన ఉత్పత్తులను ఫొటోలు తీసి.. ధరలను నిర్ణరుుంచి.. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంది. కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే గోకూప్ ఉద్యోగి ఆయా ఉత్పత్తులుండే ప్రాంతానికి వెళ్లి ఉత్పత్తిని పరీక్షించి, ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాడు’’ అని. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.

10 రాష్ట్రాలు.. 275 సంఘాలు..: ప్రస్తుతం గోకూప్ 10 రాష్ట్రాల్లోని 275 చేనేత సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆప్కో, బోయంక, కేహెచ్‌డీసీ, ఇంద్రయాని, పోచంపల్లి, కోయల్‌గూడెం, ఉత్కళ్ వంటి దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ ఒప్పందాలు చేసుకున్నారుు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని సుమారు 60 వేల మంది చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆయా ఉత్పత్తులను గోకూప్ వేదికగా ఆన్‌లైన్‌లో విక్రరుుంచడమే మా వ్యాపారం. ఒక్కో ఆర్డర్‌పై కొనుగోలుదారు నుంచే 5-10 శాతం కమిషన్ రూపంలో తీసుకుంటాం.

 30 శాతం ఆర్డర్లు విదేశాల నుంచే..
మహిళలు, పురుషుల విభాగంలో అన్ని రకాల చేనేత దుస్తులు, బ్యాగులు, పర్సులు, నగలు, హోం ఫర్నిచర్, హస్త కళలు వంటి ఉత్పత్తులున్నారుు. సుమారు 20 వేలకు పైగా ఉత్పత్తులు నమోదయ్యారుు. ప్రస్తుతం నెలకు 4-5 వేల ఆర్డర్లొస్తున్నారుు. ఇందులో 30% ఆర్డర్లు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల నుంచి వస్తున్నవే. మా మొత్తం వ్యాపారంలో 60 శాతం వాటా చీరల విభాగానిదే. పోచంపల్లి, మంగళగిరి, సంబల్‌పురి, ఇక్కల్, తుస్సార్ వంటి అన్ని రకాల సంప్రదాయ చేనేత చీరలున్నారుు. ఉత్పత్తుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్, ఫెడెక్స్, డీటీసీపీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.

మరో 3 రాష్ట్రాలకు విస్తరణ..
ప్రస్తుతం గోకూప్‌లో 50 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఏటా 100 శాతం వ్యాపారం వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఏంజిల్స్, సాహా ఫండ్‌‌స, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు గోకూప్‌లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ చేయాలని నిర్ణరుుంచాం. వీసీ ఫండ్‌‌స కోసం చూస్తున్నాం. వీటి సహాయంతో గుజరాత్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలని లక్ష్యించాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement