‘చేనేత’ను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: తమ్మినేని
వర్ని: చేనేత కార్మికులను ఆదు కోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజ న పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శిం చారు. చేనేత వృత్తి గిట్టుబాటు కాక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారని, ప్రభుత్వమే వారు నేసిన బట్టలను కొని ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫా రంగా అందజేయాలన్నారు.
ఇటీవల పాముకాటుతో మృతిచెందిన చిన్నారి దీక్షిత కుటుంబాన్ని వీరభద్రం పరామర్శించారు. రుద్రూర్ బ్యాంకు వద్ద పెద్ద నోట్ల రద్దు వల్ల పడుతున్న ఇబ్బందులపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీడీ, గీత కార్మికుల సమ స్యలు పట్టించుకోని ప్రభుత్వం.. సమస్యలున్నాయని గళమెత్తితే లాఠీ చూపిస్తోందన్నారు. బోధన్‌లో పర్య టిస్తూ ఎస్సీ కార్పొ రేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులను కార్పొరేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు.