మాటల గారడీ.. బడ్జెట్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మోటకొండూరు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా చేసిందేమీ లేదని, సీఎం కేసీఆర్ తన మాటల గారడీతో ప్రజలను మభ్య పెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో బుధ వారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాలకు ఎంగిలి మెతు కులు వేసినట్టు బడ్జెట్ రూపొం దించారని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా గత ప్రభు త్వాలు మాదిరిగానే కేసీఆర్ సర్కార్ వ్యవహరి స్తోందన్నారు.
కార్యక్రమంలో పార్టీ నేత చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. కాగా, కొత్త జిల్లాలు, మండలాల్లో క్షేత్రస్థాయిలో సౌకర్యాలు లేవని సీపీఎం పేర్కొంది. కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని నూతన మోటకొండూరు మండల కేంద్రంలో మండల పాలనకు కావాల్సిన కనీస సౌకర్యాలు నేటీకి సమకూరలేదని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.