ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి: తమ్మినేని | Tammineni comments on TRS Government | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి: తమ్మినేని

Published Sun, Apr 30 2017 1:47 AM | Last Updated on Thu, Jul 11 2019 9:04 PM

ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి: తమ్మినేని - Sakshi

ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి: తమ్మినేని

ఖమ్మం సహకారనగర్‌: ప్రతిపక్షాలకు కాదు.. సీఎం, రాష్ట్ర మంత్రులకే పిచ్చిపట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులను సంక్షోభంలోకి నెట్టింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. జీవో 123ను హైకోర్టు రద్దు చేస్తే.., దానిని ప్రతిపక్షాలు రద్దు చేయించాయని మంత్రి తుమ్మల చెబుతున్నారని, హైకోర్టులో కూడా ప్రతిపక్షం ఉందా అని ప్రశ్నించారు. రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ నెల 30 న జిల్లా వ్యాప్తంగా నిరసనలు, మే 2న జిల్లా దిగ్బంధనం చేపట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement