
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు: వైఎస్సార్ నేతన్న నేస్తం చేనేతలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మున్ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. స్థానిక 37 వార్డు పరిధిలోని హనుమాన్‌నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో చేనేత నాయకుడు సింపిరి అనిల్ కుమార్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తాను పుట్టింది చేనేతల ఇళ్ల మధ్యనే అని, పుట్టినప్పటినుంచీ మీతో తత్సంబంధాలు కొనసాగిస్తున్నాని చెప్పారు. ఏప్రభుత్వం చేనేతల అభివృద్ధి గురించి ఆలోచిస్తుందో, ఏ ముఖ్యమంత్రి మీ పట్లప్రేమాభిమానాలు చూపుతున్నారో తెలుసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతలకు రూ.350 కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు. అలాగే సబ్సిడీ పథకాన్ని అమలుచేసింది ఆయనే అని తెలిపారు.
ఆయన కుమారుడైన వైఎస్ జగన్ బీసీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత మీ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. 2014 ఎన్నికల్లో చేనేతల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో పెట్టినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. గతంలో చేనేతల ఫించన్లకు తాను దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పేదల ఇళ్లనిర్మాణం కోసం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి 300 ఎకరాలకు పైగాభూములు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తొలిమారు ఈ విధంగా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో ఈ పక్రియ చేపట్టామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో చేనేతలకు తప్పక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నారని తెలిపారు.
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అవ్వారు ప్రసాద్ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత సామాజిక వర్గం ఓట్లతో మూడు మార్లు ముఖ్యమంత్రి అయినా తమ సంక్షేమాన్ని గాలికొదిలేశారని వివరించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి చేనేతల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. చేనేతల అభివృద్ధి కి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడిచిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ఆర్, చేనేత నాయకులు, మెడికల్‌షాపు శ్రీను, పల్లా సురేష్, పుణ్యవతి, రమణారెడ్డి, శివారెడ్డి, బండారు సుబ్రమణ్యం, రాగా నరసింహరావు, శ్రీను, కృష్ణా, నాగేంద్ర, కన్నయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment