Grain farmers
-
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’’ అంటూ సీఎం ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు -
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఉత్తరాంధ్రలో వారంలోగా.. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. -
ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. రూ.1,096.52 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు శుభవార్త! ఆర్బీకేల ద్వారా రైతన్నల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రూ.1,096.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 3.29 లక్షల మంది రైతుల నుంచి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. తాజా చెల్లింపుతో మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లయింది. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వం వేగంగా చెల్లింపులు కూడా జరుపుతోంది. 21 రోజుల్లోపు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం నుంచి పది రోజుల లోపే రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన దాఖలాలున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. తొలిసారిగా అదనపు సాయం.. ధాన్యం సేకరణలో తొలిసారిగా తెచ్చిన ఆన్లైన్ విధానంతో రైతులకు పారదర్శకంగా మద్దతు ధర లభిస్తోంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను సైతం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. వీటి కింద ఇప్పటివరకు రూ.45.91 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు 50 శాతం చెల్లింపులను పూర్తి చేసింది. గత సర్కారు హయాంలో ఇవేమీ లేకపోగా రైతులకు ధాన్యం సొమ్ములను నెలలు తరబడి బకాయిలు పెట్టారు. మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూర్చేందుకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసింది. ఫలితంగా రైతన్నల్లో ఆందోళన రేకెత్తించి నష్టానికే మధ్యవర్తులకు ధాన్యం విక్రయించుకోవాల్సిన దుస్థితి కల్పించింది. ఇలాంటి వాటిని అరికడుతూ రైతులే తొలి ప్రాధాన్యంగా 21 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర జమ చేయాలని నిర్ణయించి సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి ఖరీఫ్ ధాన్యం సేకరణను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించాం. ఆన్లైన్ విధానంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర లభిస్తోంది. పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం ప్రకారం చెల్లింపులు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ, జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ధాన్యం డబ్బులేవి..!
వీణవంక(హుజూరాబాద్): కరువు పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు మొండి చేయి చూపాయి. సీడ్(ఆడ, మగ)ను తీసుకెళ్లి.. పది రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 40రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చేతిలో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గత్యంతరం లేక ప్రైవేటు అప్పును ఆశ్రయిస్తున్నారు. రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48వేల ఎకరాల్లో హైబ్రీడ్ వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 8వేల ఎకరాలలో పంట ఎండిపోయింది. సుమారు 2.52లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కన రూ.100కోట్లు రైతులకు కంపెనీలు బకాయి పడ్డట్లు సమాచారం. రాష్ట్రంలోనే హైబ్రీడ్(ఆడ, మగ)సీడ్ వరి సాగులో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నేలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. 30 ఏళ్లుగా ఇక్కడి రైతులు హైబ్రీడ్ వరిని సాగు చేస్తున్నారు. ప్రతీ కంపెనీ రైతుల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించడం లేదు. రెండు మూడు కంపెనీలు మాత్రమే రైతులకు చెక్కు రూపంలో ఇస్తున్నాయి. మిగిలిన కంపెనీలు తమ ఏజెంట్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. దీంతో ఏజెంట్లు డబ్బులను తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే కరువుతో గత మూడేళ్లుగా ఆశించిన దిగుబడి లేక రైతులు కుదేలయ్యారు. ఇప్పుడు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా కంపెనీలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం లేక.. శ్రమకు తగిన ఫలితం లేక రైతులు కుదేలవుతున్నారు. క్వింటాల్‌కు రూ.4వేల నుంచి 8వేల వరకు చెల్లిస్తుండడంతో సీడ్ వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. సీడ్ కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10కిలోల చొప్పున తరుగు పేరుతో నిలువు దోపిడీకి దిగుతున్నారు. ఈ లెక్కన అదనంగా రూ.800 నష్టపోతున్నారు. అదేవిధంగా కాంటాలలో 4నుంచి 5కిలోల వ్యత్యాసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆర్గనైజర్ల చేతివాటం.. సీడ్ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్లు(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనం సాగు చేయిస్తుంటారు. ఇక్కడ డీలర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ మల్టినేషన్ కంపెనీ క్వింటాల్ రూ.7వేలు చెల్లిస్తుండగా సదరు డీలర్లు రూ.6వేలకే రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు వెయ్యి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే రైతులను నిలువున ముంచుతూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొన్ని కంపెనీలు నాలుగు రోజుల క్రితం ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారని తెలిసింది. కానీ ఏజెంట్లు తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులకు మొండి చెయ్యి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100కోట్లు పెండింగ్.. హైబ్రీడ్ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడుతోపాటు జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 15క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పినా 6 నుంచి 8క్వింటాలలోపు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. ఈ లెక్కన 2.52లక్షల క్వింటాల దిగుబడి వచ్చిందని అంచనా. సుమారు రూ.100కోట్ల పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంత వరకు చిల్లిగవ్వ రైతులకు అందలేదు. పది రోజుల్లో ఇస్తామని రైతులకు చెప్పి నెలల కొద్ది తిప్పుతున్నారు. గతంలో కంపెనీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. తరుగు, తేమ పేరుతో క్వింటాల్‌కు 10కిలోలు తీసేస్తున్నారు. కొన్ని కంపెనీలు బహిరంగ దోపిడీకి దిగుతున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తాం.– మడుగూరి సమ్మిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఎదురుచూపులు
మెదక్‌జోన్: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకండి .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించండి’ అని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ధాన్యం విక్రయించి నెలరోజులు గడిచిపోతున్నా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. ఓవైపు ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడి ఎలా అంటూ అన్నదాతలు వాపోతున్నారు. జిల్లాలో ఈయేడు రబీ సీజన్లో సాగుచేసిన పంటల్లో సగం ఎండిపోయాయి. చాలామంది రైతుల బోర్లలో నీటిఊటలు అడుగంటిపోయి కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. సాగుచేసిన దాంట్లో సగం పంట మాత్రమే చేతికందింది. ఏప్రిల్ 24న జిల్లాలో 114 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జూన్ 26వ తేదీ వరకు నెలరోజుల పాటు ధాన్యం కొనుగోళ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 18,686 మంది రైతుల నుంచి 66,629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ. 1,770 చొప్పున రూ.116.89 కోట్లు అవుతుంది. ఇందులో ఇప్పటి వరకు రైతులకు రూ.76.89 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉంది. ధాన్యం అమ్మి నెలరోజులు గడిచిపోతుండడంతో రైతులు డబ్బుల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 36గంటల్లో డబ్బులేవీ? కొనుగోలు చేసిన 36 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయంటూ అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. కొందరు రైతులు ధాన్యం విక్రయించి 20 రోజులు, మరికొంత మంది అమ్మి 15 రోజులు అవుతున్నా నేటికీ ఖతాల్లోకి డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ పెట్టుబడి ఎలా? ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, ముందస్తుగా కొంటారు. ధాన్యం డబ్బులు చేతికందకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే గ్రామాల్లో సాగుచేసిన పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో పశువులపేడ, కోడి ఎరువు, చెరువుల్లోని నల్లమట్టి తదితర వాటిని పంటపొలాల్లో చల్లుతారు. వీటికి ఎకరాకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇవి పొలంలో వాడితే అధిక దిగుబడి రావడంతో పాటు సేంద్రియ ఎరువులతో పొలంలో మంచి గ్రోత్ ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటినీ ముందస్తుగా సిద్ధం చేసుకుందామంటే రైతులకు డబ్బులు సకాలంలో అందాల్సి ఉంది. ఇప్పటికైనా తమకు రావాల్సిన డబ్బులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి.. ఈఏడు రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. ధాన్యం కొనుగోళ్లు కాగానే క్రమసంఖ్య పద్ధతిలో ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఉన్నతాధికారుల సమాచారం మేరకు మరో వారం రోజు ల్లో డబ్బులు రైతుల ఖాతాల్లోకి రానున్నాయి. – ఈశ్వరయ్య, ఇన్చార్జి డీసీఓ -
కల్లాల కష్టాలు!
కోస్గి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇతర పంటలను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఏ మాత్రం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడంలేదు. మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడానికి సరైన సదుపాయం కల్పించడంలేదు. అకాల వర్షాలు కురిసి మార్కెట్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయిన ఘటనలు అనేకం. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద, సమీపంలోని రోడ్లపై కవర్లు వేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను కూడా రైతులు కాపాడుకోలేకపోతున్నారు. ఉపాధిహమీలో కల్లాల నిర్మాణం! జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ప్రభుత్వం కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించినా ఈజీఎస్ అధికారులు రైతులకు కల్లాల నిర్మాణాలపై అవగాహన కల్పించలేకపోవడంతో కల్లాలు నిర్మాణాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఉపాధిహామీ పథకంలో పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణంతో పాటు కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నా రైతులకు మాత్రం అధికారులు ఈ విషయం చెప్పడంలేదు. రైతులు కల్లాల నిర్మాణం ఆర్థిక సమస్యతో కూడుకోవడంతో సొంతఖర్చులు పెట్టి నిర్మించుకోలేని పరిస్థితి. అధికారులు కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పిస్తే వారు కల్లాలు నిర్మించుకోవడానికి ముందుకొవచ్చే అవకాశం ఉంది. ఎవరు చెప్పలేదు అధికారులు కల్లాల నిర్మాణాల గురించి ఇంతవరకు చెప్పకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఎండబెట్టుకుంటున్నాను. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రొత్సహిస్తే ఎంతోమంది పేద రైతులకు లబ్ది చేకూరుతుంది. ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. -
కొనుగోల్ మాల్!
పాలకొండ:జిల్లాలో ధాన్యం పండించిన రైతులకు ఎదురవుతున్న సమస్యల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇటు మిల్లర్లు.. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల తిరస్కరణతో కష్టనష్టాలకోర్చి పండించిన ధాన్యం రాసులను కళ్లాల్లోనే పెట్టుకొని దిక్కులు చూడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం రైతులకు శాపంగా మారింది. లెవీ తగ్గించడంతో రైతులు ధాన్యం అమ్ముకొనేందకు ఆపసోపాలు పడుతున్నారు. మార్కెట్లో పూర్తిగా డిమాండ్ లేకపోవడంతో ధాన్యానికి మద్దతు ధర లేక రైతుకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. సంక్రాంతి ముందునాటికే ధాన్యం అమ్మకాలు పూర్తి కావాల్సి ఉండగా పండుగా వెళ్లిపోయిన తర్వాత కూడా కళ్లాల్లో ధాన్యం కుప్పలు వెక్కిరిస్తున్నాయి. లెవీ తగ్గింపుతో.. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ మద్దతు ధర కంటే బయట మార్కెట్లో ఎక్కువ ధర పలికింది. దీనికి కారణం ఉత్పత్తిలో 75 శాతం వరకు లెవీగా సేకరించాలన్న లక్ష్యం ఉండటంతో దాన్ని చేరుకొనేందుకు మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసి కేంద్రాలకు విక్రయించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం లెవీని 25 శాతానికి కుదించడంతో మిల్లర్లకు ధాన్యంతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. దీంతో పలుకుబడి ఉండి నాణ్యమైన ధాన్యం పండించిన రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు గత ఏడాది బయట జిల్లాల నుంచి వర్తకులు రావడంతో మిల్లర్లు లెవీ లక్ష్యాల కోసం ధర పెంచి రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఏడాది బయట వర్తకులను రాకుండా అడ్డుకోవడంతో క్వింటాకు రూ.900 ధర లభించడమే గగనంగా మారింది. దీనిపై ఓ మిల్లరు మాట్లాడుతూ గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి కమీషన్ల కోసమే ప్రభుత్వం క్వింటాకు రూ.170 వరకు ఖర్చు చేస్తోంది. అందులో కనీసం వంద రూపాయలు మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చేవారన్నారు. ప్రభుత్వం నిర్ణయం డబ్బులు వృథా కావడానికి తప్ప కొనుగోళ్లకు దోహదపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటి... తుపాను కారణంగా రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటించినా అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. కొనుగోలు కేంద్రాలకు దీనిపై ఎటువంటి ఆదేశాలు అందలేదు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు రంగుమారిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించి నెల రోజులు కావస్తున్నా నేటికీ అమలు కాలేదు. కేంద్రాల్లో వీటికి ధర నిర్ణయించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా, హుద్‌హుద్ తుపాను కారణంగా సుమారు లక్ష హెక్టార్లలో పండిన ధాన్యం రంగుమారింది. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతులు నూర్పులు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెల జిల్లాలో మొత్తం 115 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వీటిలో ఐకేపీ పరిధిలో 83, పీఏసీఎస్‌ల పరిధిలో 51, డీసీఎంఎస్ ద్వారా 5, జీసీసీ ద్వారా 6 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే రెండు నెలలు కావస్తున్నా జిల్లా వ్యాప్తంగా 64,349 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈ నెల పదో తేదీ నాటికి 7,345 మంది రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి కారణంగా నాలుగైదు రోజులు కేంద్రాలకు సెలవు ప్రకటించడంతో కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే రైతులకు ఒక్కరోజులోనే డబ్బులు చెల్లిస్తామని ప్రకటించినా నెల రోజుల్లోపు అందించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే రైతులకు రూ.15 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బు కోసం రైతులు కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రవాణా చార్జీల కుంభకోణం రైతులకు చె ల్లించాల్సిన రవాణా చార్జీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే క్వింటాకు రూ.32 చొప్పున రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి ఏటా సీజన్ ముగిశాక ఈ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఆ క్రమంలో గత ఏడాది రవాణా చార్జీలను ప్రస్తుతం రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రవాణా చార్జీల్లో అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపారు. జిల్లాకు చెందిన ఓ నాయకుని అనుచరులకు ఈ నిధులు మళ్లించేలా పథకం వేశారు. రవాణా చార్జీలను రైతులకు నేరుగా చెల్లించకుండా ఆ బాధ్యతను డివిజన్‌కు ఒకరు చొప్పున ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు రైతు కళ్లాల నుంచి ధాన్యాన్ని ఉచితంగా మిల్లుకు తరలించాలి. అందుకు ప్రతిఫలంగా రవాణా చార్జీలను వీరి ఖాతాకు మళ్లిస్తారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు వీరు ధాన్యాన్ని తరలిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. శ్యాంపిల్‌ను మాత్రమే తీసుకెళతారు. దాన్ని కొనుగోలు కేంద్రం సిబ్బంది పరిశీలించి కొనుగోలు అంగీకరించిన తర్వాత కళ్లాల్లో తూకం వేయించి నేరుగా మిల్లుకు అప్పజెబుతారు. కానీ ధాన్యాన్ని కాంట్రాక్టర్లే తరలిస్తున్నట్లు కేంద్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ విధంగా సుమారు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు అవకాశం కల్పించారు. అధికారులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి హస్తం ఉండడంతో ఏమీ చేయలేక రైతులే పోరాడాలని సూచిస్తున్నారని జిల్లా ఏరువాక సభ్యుడు ఖండాపు ప్రసాదరావు చెప్పారు. మిల్లరు తిరస్కారం అంపిలి గ్రామానికి చెందిన ఇనుముల అప్పారావు ఇటీవల పంట నూర్పులు పూర్తి చేసి ధాన్యం అమ్మేందుకు శ్యాంపిల్‌తో మిల్లరు వద్దకు వెళ్లాడు. ‘ఈ ధాన్యాన్ని మేము కొనలేం, తేవాల్సిన అవసరం లేద ని’ మిల్లరు స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతు చెప్పగా జిల్లా కలెక్టర్‌తో సహా ఎవరికి చెప్పుకోమంటావో చెప్పుకో అంటూ సమాధానమిచ్చారు. కొనుగోలు కేంద్రం నిస్సహాయత మరో రైతు కాయల సత్యనారాయణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాడు. మా వద్దకు వస్తే చేసేది ఏమీ లేదు. మిల్లర్‌కు తీసుకెళ్లండి. కొనుగోలుకు వారు ఇష్టపడితే మేం గోనె సంచులు ఇస్తామని అక్కడి సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు.